Gossipsయంగ్ టైగర్ కి ఆహ్వానం వెనుక సూపర్ స్టార్ "మాస్టర్" ప్లాన్

యంగ్ టైగర్ కి ఆహ్వానం వెనుక సూపర్ స్టార్ “మాస్టర్” ప్లాన్

బ్రహ్మోత్సవం , స్పైడర్ సినిమాలతో వరుసగా రెండు భారీ డిజాస్టర్లు మహేష్ బాబు ఖాతాలో పడటంతో ఖంగు తిన్న సూపర్ స్టార్ ఈ సారి మాత్రం మాస్టర్ ప్లాన్ వేసాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమాకి పబ్లిసిటీ ని సరికొత్తగా ప్లాన్ చేయటమే కాకుండా మరీ హైప్ కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నారు. స్పైడర్ సినిమాకి విడుదలకి ముందు రోజు మరీ దారుణమైన నెగటివ్ టాక్ రావడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఒక కారణం అని మహేష్ బాబు కి సమాచారం అందింది అట.

ఇక ఎన్టీఆర్ అభిమానులకి కి మహేష్ బాబు అభిమానులకి సోషల్ మీడియా వేదికగా జరిగే కొట్లాట మాములుగా ఉండదు. ఈ విషయాలన్నీ గమనిస్తున్న మహేష్ బాబు సోషల్ మీడియా టీమ్ “ఎన్టీఆర్ మహేష్ బాబు మంచి మిత్రులు అనే సంకేతాన్ని ఇరు వైపుల అభిమానులకి అందించాలి ” అని మహేష్ బాబు కి ఒక మాస్టర్ ప్లాన్ చెప్పింది ఆ క్రమంలో కొరటాల శివ కి ఆప్త మిత్రుడైన ఎన్టీఆర్ ని మహేష్ బాబు తానే స్వయంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానించాడు. ఇక ఇటు మెగా అభిమానులని కూడా మచ్చిక చేసుకునే క్రమంలో రంగస్థలం సినిమాపై నిన్న ట్వీట్ కూడా చేయించారు.ఏది ఏమైనా ఈ సారి సూపర్ స్టార్ టీం చాలా జాగ్రత్త గా భరత్ అనే నేను సినిమా ని ప్రమోట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news