Gossipsకత్తి యుద్ధం చేయబోతోన్న ఫోర్న్ స్టార్

కత్తి యుద్ధం చేయబోతోన్న ఫోర్న్ స్టార్

ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ కి మహర్దశ పట్టుకుంది. అందుకే ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి. ఫోర్న్ ఫిల్మ్స్ లో నటిస్తూ … ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సుందరి ఆ తరువాత ఆ ఫీల్డ్ కి గుడ్ బాయ్ చెప్పేసి బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక అక్కడ నుంచి అన్ని భాషల నుంచి ఆమెకు అవకాశాలు వస్తుండడంతో బీజీ స్టార్ గా మారిపోయింది.

అలాంటి సన్నీలియోన్ ను హీరోయిన్ గా పెట్టి, అది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ మీద పైగా ఆసక్తి పెంచేలా ట్విట్టర్ లో చిన్న హడావుడి కూడా చేసారు.
ఇప్పటివరకు దేవి అనే టైటిల్ మాత్రమే బయటకి వెల్లడించిన చిత్ర యూనిట్ ఆ తరువాత మెల్లగా.. మొత్తం వీరమహాదేవి అనే టైటిల్ ని బయటకి విడుదల చేసారు.

తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో తయారయ్యే ఈ సినిమాకు తమిళ దర్శకుడు వడివుడైయన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సన్నీ కత్తి పట్టుకుని వీరోచిత పోరాటాలు చేస్తుందంటే. అందుకోసం ఇప్పటికే ఆమె శిక్షణ కూడా తీసుకుంది. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకోబోతోంది. .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news