Gossipsపవర్ స్టార్ పార్టీలోకి సన్నిలియోన్ ! 

పవర్ స్టార్ పార్టీలోకి సన్నిలియోన్ ! 

పోర్న్ స్టార్ సన్నీలియోన్ పవర్ స్టార్ పార్టీలో చేరబోతోంది ! పవన్ కళ్యాణ్ సన్నీలియోన్ కలిసి ఎన్నికలకి వెళ్తే ఇక తిరుగుండదు. అయ్యో ఆగండి ఆగండి ఇవన్నీ మేము అంటున్నవి కాదు, కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ అయిన వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటున్న మాటలు. నిజమేనండోయ్ కావాలంటే మీరే చదవండి.

రాంగోపాల్ వర్మ నోరే కాదు చెయ్యి కూడా తిన్నగా అందుకే ఎప్పుడూ ఏదో ఒక ట్విట్ సోషల్ మీడియా లో పెడుతూ ఎప్పుడూ వార్తల్లో ఉండాలని చూస్తుంటాడు. దీనిలో భాగంగానే ఈసారి పవన్‌కల్యాణ్- సన్నీలియోన్‌కి మధ్య లింక్ పెట్టేశాడు.

‘‘ పవన్‌ కంటే సన్నీని చూసేందుకు ఎక్కువమంది అభిమానులు వస్తున్నారంటే.. ఎవరిని పుట్టించిన ఏ అమ్మలో ఏ బిడ్డ తప్పుందో ఏ అమ్మకి కూడా తెలియదని ప్రతి నాన్నకు తెలుసని అర్థం’’.. అంటూ తనకు కూడా అర్థంకాని రాతలు  రాసుకోచ్చేసాడు ఈ తికమక డైరెక్టర్.

‘‘వచ్చే ఎన్నికల్లో సన్నీలియోన్- పవన్‌కల్యాణ్ కలిసి పోటీ చేస్తే.. అద్భుతమైన రాజకీయ వ్యూహం అవుతుందనేది తన ప్రగాఢ నమ్మకం’’గా రాసుకొచ్చాడు. ‘‘ఇద్దరూ వేర్వేరుగా ప్రజలకి వేర్వేరు ఎంటర్‌ టైనింగ్ సుఖాలు ఇచ్చారని, వీళ్లిద్దరికీ భారీగా జనాలు వస్తారు కాబట్టి, జనసేన/జనసేవ పార్టీ సూపర్ హిట్’’ అవుతుందని  రాసుకొచ్చాడు.

వర్మ రాతలపై పవన్ అభిమానులతోపాటు జనసేన కార్యకర్తలూ ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. ఆయనకు నిజంగా మైండ్ దొబ్బిందనే కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతోంది. అయితే దీనిపై పవర్ స్టార్ మాత్రం స్పందించలేదు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news