Moviesఏమండోయ్.. సన్నీ లియోన్ బయో పిక్ టీజర్ చూశారా ..? (వీడియో)

ఏమండోయ్.. సన్నీ లియోన్ బయో పిక్ టీజర్ చూశారా ..? (వీడియో)

పోర్న్ స్టార్ గా ఫుల్ క్రేజ్ సంపాదించి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇండియాకు వచ్చి ఇక్కడ బాలీవుడ్ హాట్ స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్న సన్ని లియోన్ తన బయోపిక్ ను వెబ్ సీరీస్ రూపంలో తెస్తుంది. కరంజిత్ కౌర్ అలియాస్ సన్ని లియోన్ ఆమె అసలు పేరుతో ఈ బయోపిక్ రాబోతుంది.

సన్ని చిన్ననాటి పరిస్థితులు ఆమెని పోర్నోగ్రఫీ వైపుకు వెళ్లేందుకు దారితీసిన పరిస్థితులు.. సన్ని పోర్న్ స్టార్ గా మారకముందు విషయాలను ఇందులో ఎక్కువ ప్రస్థావించడం జరిగింది. ఇక సినిమాగా చెప్పాలంటే బోల్డ్ సీన్స్ ఉంటాయి కాబట్టి తన బయోపిక్ వెబ్ సీరీస్ కరెక్ట్ అంటుంది సన్ని.

జీ 5 సినిమాస్ వారు ఈ బయోపిక్ రిలీజ్ చేస్తున్నారు. ఇది చూడాలంటే వారు నిర్ణయించిన ఎమౌంట్ కట్టి ఈ వెబ్ సీరీస్ చూడాల్సిందే. చూస్తుంటే సన్ని బయోపిక్ కు మంచి డిమాండ్ ఏర్పడేలా ఉంది. పోర్న్ స్టార్ గా ఫుల్ స్టాప్ పెట్టి సినిమాలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తున్న సన్ని లియోన్ కు ఈ బయోపిక్ ఎలాంటి క్రేజ్ తెస్తుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news