Gossips12 కోట్ల నుండి 1 కోటికి పడిపోయిన స్టార్ డైరక్టర్..!

12 కోట్ల నుండి 1 కోటికి పడిపోయిన స్టార్ డైరక్టర్..!

అతనో స్టార్ డైరక్టర్.. చాలా ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నాడు. ఓ ఐదేళ్ల క్రితం అతను టాప్ లీడింగ్ డైరక్టర్స్ లో ఉన్నాడు. సినిమా అంటే కామెడీ ఎంటర్టైనర్ అన్న విధంగా ప్రతి సినిమాలో అది స్టార్ సినిమా అయినా సరే కామెడీని మాత్రం మిస్ కానివ్వడు. హిట్లు మీద హిట్లు కొట్టి స్టార్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

ఒకానొక టైంలో రెమ్యునరేషన్ కూడా 12 కోట్ల దాకా తీసుకున్నాడు.. కాని హిట్లు ఇచ్చిన స్టార్స్ కు వరుసగా ఫ్లాపులు ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇంకేముందు గ్రాఫ్ తగ్గినట్టుగా అతని రెమ్యునరేషన్ కూడా తగ్గింది. ప్రస్తుతం సదరు దర్శకుడి సినిమా ఇచ్చే నిర్మాతే కరువయ్యాడట. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా 12 నుండి కోటి రూపాయలకు తగ్గించేశాడట.

అయినా అవకాశాలు రావట్లేదు. లాస్ట్ ఇయర్ ఓ పెద్ద ఫ్యామిలీ హీరోతో లవ్ స్టోరీ తీసినా లాభం లేకుండా పోయింది. మొత్తానికి ఫాం లో ఉన్నప్పుడు భారీ పారితోషికం తీసుకున్న ఈ డైరక్టర్ ఇప్పుడు కోటి, అర కోటి డిమాండ్ చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఈ డైరక్టర్ ట్రాక్ ఎక్కుతాడా లేక ఇలానే ఉండిపోతాడా అన్నది వేచి చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news