Gossipsరాజమౌళి నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ కంఫార్మేడ్

రాజమౌళి నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ కంఫార్మేడ్

ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్  SS రాజమౌళి ప్రస్తుతం ఎవరితో చిత్రం చెయ్య బోతున్నారన్నది  సర్వత్రా ఆసక్తికరంగా మారింది . పలు ఊహాగానాలు మరిన్ని  గాసిప్స్ మధ్య ఇప్పుడు రాజమౌళి తన నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ ని కంఫర్మ్ చేసేసారు .

అందులో ఒకటి DVV దానయ్య నిర్మించనున్నారు .ఈ చిత్రం ఒక సోషల్ డ్రామాని బేస్ చేసుకొని ఉంటుందని రాజమౌళి కంఫర్మ్  చేసారు . అయితే ఇంకా కాస్టింగ్ పైన ఎటువంటి డెసిషన్  తీసుకోలేదని ఆయన చెప్పారు . చిన్న నటీనటులతో ఈ సినిమా తీస్తారని టాలీవుడ్ వర్గాల అంచనా . అందులో ఏ  మాత్రం నిజం లేకపోనూలేదు . ఎందుకంటే మగధీర లాంటి యాక్షన్ ప్యాకెడ్ సినిమా తీసాక మర్యాద రామన్న తీసి హిట్ కొట్టారు రాజమౌళి . దానికి అయన దగ్గర పెద్ద స్ట్రాటజీనే వుంది . బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి చిత్రం అంటే మరో అవతార్ రేంజ్ లో ఉంటుందేమో అనే సగటు ప్రేక్షకుడి అంచనాలను పెంచకుండా , సాధారణ నేపధ్యాని ఎంచుకున్నారు రాజమౌళి.

DVV దానయ్య చిత్రం తర్వాత మహేష్ తో ఒక సినిమా చేయనున్నారు రాజమౌళి . భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని KL నారాయణ నిర్మించనున్నారు . అయితే ఆ సినిమా పట్టాలెక్కడానికి ఒకటిన్నర సంవత్సరం పట్టవచ్చు . మహేష్ ఇప్పుడు తాను కమిట్  అయినా సినిమాలు భారత్ అనే నేను , వంశి పైడిపల్లి దర్శకత్వం లోని మరో చిత్రం , త్రివిక్రమ్ సినిమా , ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఉంటుందని సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news