అక్కినేని అవార్డ్ పై రాజమౌళి.. నేను అర్హుడను కాదు కాని..!

SS Rajamouli at ANR awards 2017

అక్కినేని నాగేశ్వర రావు పేరిట అక్కినేని నాగార్జున అండ్ ఫ్యామిలీ కలిసి ప్రతి ఏటా అక్కినేని నేషనల్ అవార్డ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇయర్ ఆ అవార్డ్ దర్శకధీరుడు రాజమౌళి అందుకున్నాడు. బాహుబలి సినిమాతో ప్రపంచ దేశాలకు తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించిన రాజమౌళి ఈ అవార్డ్ తనకు రావడం పట్ల కాస్త షాక్ కు గురయ్యారు.

నిజంగా ఈ అవార్డుకు తాను అసలు అర్హుడను కాదని తన ఫీలింగ్ అంటూ అభిప్రాయపడ్డారు. ఇక ఈ అవార్డ్ తన మీద మరింత భాధ్యత పెంచిందని అన్నారు. ఇక ఏయన్నార్ గారు హార్ట్ సర్జరీ తర్వాత కూడా ఆత్మ స్థైర్యంతో కొన్నాళ్లుగా మన మధ్య ఉన్నారని.. 28 ఏళ్ల దాకా చావుకి ఛాన్స్ ఇవ్వని ఆయన 2011 తర్వాత ఇక నీ ఇష్టం ఎప్పుడైనా సరే తనని తీసుకెళ్లొచ్చని చెప్పారని.. అందుకే 2014లో మన నుండి దూరమయ్యాడని అన్నారు.

తాను రమ్మన్నప్పుడే చావుని తన దగ్గరని రమ్మని చెప్పిన ఇద్దరిలో ఒకరు మహాభారతంలో భీష్మా చారులు ఆ తర్వాత అక్కినేని నాగేశ్వర్ రావు గారు అంటూ ఏయన్నార్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు రాజమౌళి. ఇక తనకు ఈ అవార్డ్ అందచేసేందుకు వచ్చిన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి తన ధన్యవదాలు తెలిపాడు జక్కన్న.

 

More from my site