Gossipsతండ్రి పొలిటికల్ ఎంట్రీ పై కూతురు సెన్సేషనల్ కామెంట్స్

తండ్రి పొలిటికల్ ఎంట్రీ పై కూతురు సెన్సేషనల్ కామెంట్స్

క‌మ‌ల్ గారాల‌ప‌ట్టి శ్రుతి హ‌స‌న్ … త‌న తండ్రిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది. ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రంకు సంబంధించి పాజిటివ్ గా రియా క్టైంది. ప్రజాసేవే లక్ష్యంగా  రాజకీయాల్లోకిఅడుగుపెట్టబోతున్నారని, సినిమాల్లోనే కాదు…నిజ జీవితంలో కూడా ఆయనో గొప్ప నాయకుడని పాలి టిక్స్ లో తప్పక రాణిస్తార‌ని అభిప్రాయ‌ప‌డింది.

క‌మ‌ల్ నిజాయతీపరుడని..అన్ని విషయాల్లో ముక్కు సూటిగా మొహమాటం లేకుండా మాట్లాడుతార‌ని, ఆయన ఏ పని చేసినా బాగా ఆలోచించి విశ్లేషించిన తర్వాతే చేస్తారని చెప్పింది. ఆయన చేయబోయే పనిపై ఒక స్పష్టమైన అవగాహన ఉన్నపుడే దానిని ప్రారంభిస్తారని తెలిపింది. ఆయన చేసే ప్రతి పనిలో తన మద్దతు తప్పక ఉంటుందని పేర్కొంది.

కానీ క‌మ‌ల్‌తో కొంత కాలం స‌హ‌జీవ‌నం చేసిన గౌత‌మి మాత్రం భిన్న స్వ‌రం వినిపిస్తోంది.ఆయ‌న‌తో క‌లిసి జీవించినంత మాత్రాన మ‌ద్ద‌తు ఇవ్వాలా అని ప్ర‌శ్నిస్తోంది. రాజ‌కీయాల కోసం న‌ట‌న‌కు గుడ్ బై చెప్పి ఇటుగా రావ‌డం అభిమానుల‌కు ఓ నిరాశ‌గా అనిపించినా ఆయ‌నేం సాధించ‌నున్నార‌న్న‌దే ఇప్పుడు కీల‌కం.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news