Moviesఎన్టీఆర్ కొడుకు ఎన్టీఆర్ కాలేడు ..మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ కాలేడు (వీడియో)

ఎన్టీఆర్ కొడుకు ఎన్టీఆర్ కాలేడు ..మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ కాలేడు (వీడియో)

సీనియర్ హీరోలంతా రూటు మార్చి సపోర్టింగ్ రోల్స్ తో సరిపెట్టుకుంటుంటే ఈమద్య శ్రీకాంత్ కూడా అలాంటి రెండు మూడు ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యాడు. అందుకే మళ్లీ సోలోగానే తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అలాంటి ప్రయత్నంలోనే తను లీడ్ రోల్ గా చేస్తున్న సినిమా ఆరేషన్ 2019. టోటల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ యువ నాయకుడిగా కనిపిస్తున్నాడు.

శ్రీకాంత్ కెరియర్ లో ఆపరేషన్ దుర్యోధన ప్రత్యేకమైన సినిమా.. ఆ సినిమా సీక్వల్ గా ఆపరేషన్ 2019 అంటూ వస్తున్నాడు. కరణం బాబ్జి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అలివేలు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో డైలాగులతో దుమ్మురేపుతున్నాడు శ్రీకాంత్. గాంధి కొడుకు గాంధి, ఎన్.టి.ఆర్ కొడుకు ఎన్.టి.ఆర్, మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ కాలేడు అంటూ నిజమైన నాయకుడు ప్రజల్లోంచి రావాలని కేక పెట్టించే డైలాగ్ చెప్పాడు.

ఈ డైలాగ్ ఒక్కటి చాలు థియేటర్ కు జనాలను రప్పించడానికి.. అయితే సినిమా కేవలం ఒక డైలాగ్ ను నమ్ముకుని వెళ్లలేం కాబట్టి సినిమా టీజర్, ట్రైలర్ పై ఓ ఒపినియన్ కు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ సినిమాలో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ దీక్షా పంథ్ హీరోయిన్ గా నటిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news