Gossips'మహనటి' తర్వాత నేటితరం 'మహానటుడు' ఎన్టీఆర్ తో వైజయంతి మూవీస్ సినిమా..!

‘మహనటి’ తర్వాత నేటితరం ‘మహానటుడు’ ఎన్టీఆర్ తో వైజయంతి మూవీస్ సినిమా..!

కొన్నాళ్లు సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్న వైజయంతి మూవీస్ అధినేత అశ్వనిదత్ ఈమధ్యనే మహానటి సినిమాతో మరోసారి ఆ బ్యానర్ కు ఉన్న స్టామినా ఏంటో చూపించారు. ప్రయోగాలకు పెద్దపీఠ వేసే వైజయంతి మూవీస్ సినిమా నిర్మాణానికి చాలా గ్యాప్ ఇచ్చింది. ఆస్ట్రాలజీ ఎక్కువగా నమ్మే అశ్వనిదత్ జ్యోతిష్యుడు చెప్పబట్టే నిర్మాణ రంగానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలుస్తుంది.

ఇక ఇప్పుడు మళ్లీ మహానటితో సినిమాలు మొదలు పెట్టారు. త్వరలో మొదలవబోయే మహేష్ 25వ సినిమాను దిల్ రాజు తో పాటుగా అశ్వనిదత్ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఇక ఇదే కాకుండా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో అశ్వనిదత్ సినిమా చర్చల దశల్లో ఉందట. తారక్ తో శక్తి చేసిన వైజయంతి మూవీస్ మళ్లీ క్రేజీ ప్రాజెక్ట్ కు సిద్ధమవుతుందట.

ఈ ప్రాజెక్ట్ దర్శకుడు ఎవరన్నది త్వరలో తెలియచేస్తామని అశ్వనిదత్ అంటున్నారు. మొత్తానికి వైజయంతి బ్యానర్ మళ్లీ వరుస సినిమాలు చేయాలనుకోవడం సిని పరిశ్రమకు మంచిదే అని చెప్పాలి. మరోపక్క వరుస సక్సెస్ లతో ఫాం లో ఉన్న తారక్ వైజయంతి బ్యానర్లో ఎలాంటి ప్రెస్టిజియస్ సినిమా చేస్తాడో అని ఫ్యాన్స్ అంచనాలేయడం మొదలుపెట్టారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news