Videosమహేష్ బాబు భయపెట్టే 'స్పైడర్' టీజర్ రివ్యూ (వీడియో)

మహేష్ బాబు భయపెట్టే ‘స్పైడర్’ టీజర్ రివ్యూ (వీడియో)

మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది… సంవత్సరం దాటింది తమ హీరో నుండి సినిమా వచ్చి.. మురుగదాస్ మహేష్ బాబు క్రేజీ కాంబినేషన్ లో మొదలైన స్పైడర్ సినిమా కి అడుగడుగునా ఎన్నో అవాంతరాలు.. ఎన్నో మార్పులు, వాయిదాలు.. చెప్పిన టైం కి ఏమీ కుదరటం లేదు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 9 గంటలకు రిలీజ్ చేస్తామన్న టీజర్ కూడా ముందుగానే వచ్చేసింది.

ఇక టీజర్ విషయానికొస్తే విలన్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. “పెరుగుతున్న జనాభాని కంట్రోల్ చేసేందుకు గవర్నమెంట్,భూకంపం,ఈ సునామీ లా నేను ఒక భాగమే” అనే డైలాగు తో విలన్ క్యారెక్టర్ ని పరిచయం చేశారు.. ఇదే ఊర్లో నీలాగే మరొకడున్నాడు అంటూ హీరో క్యారెక్టర్ ని కూడా పరిచయం చేశారు. హీరోతో బ్లైండ్ డేట్ కావాలంటూ హీరోయిన్ క్యారెక్టర్ ని చూపించారు. చివర్లో మహేష్ “ఆ రోజు అంతమంది జనంలో నువ్వు దాక్కున్నావే.. అదే భయం.. భయపెట్టడం మాకు తెలుసు” అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో ముగించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news