Gossipsశ్రీయ రహస్య వివాహం ...పెళ్లి ఫోటోలు వైరల్..!

శ్రీయ రహస్య వివాహం …పెళ్లి ఫోటోలు వైరల్..!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా దాదాపు దశాబ్ధం పైగా తన అందం అభినయంతో అలరిస్తున్న శ్రీయ శరణ్ కొన్నాళ్లుగా పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే మీడియా వార్తలకు కాదు లేదు అంటూనే సడెన్ గా పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది అమ్మడు. రష్యాకు చెందిన ఆండ్రీ కొశీవ్ ను పెళ్లాడింది శ్రీయ.shriya-saran-Andrei-Koscheev-wedding-photos-600x589

ఈ నెల 14న కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఈ రహస్య వివాహం జరిగింది. ప్రస్తుతం శ్రీయ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా పైసా వసూల్ తో బాలయ్య సరసన నటించిన శ్రీయ ప్రస్తుతం తేజ డైరక్షన్ లో వెంకటేష్ హీరోగా వస్తున్న ఆటా నాదే వేటా నాదే సినిమాలో నటిస్తుంది. sriya1 (1)

సినిమా వాళ్లకు కూడా చెప్పకుండా శ్రీయ పెళ్లి మ్యాటర్ ను సీక్రెట్ గా ఉంచిందో అని డౌట్ పడుతున్నారు. మొత్తానికి శ్రీయ పెళ్లితో తన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే పెళ్లి తర్వాత కూడా అమ్మడు సినిమాలు కొనసాగించాలని చూస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news