Movies‘శతమానం భవతి’ రెండురోజుల కలెక్షన్స్ రిపోర్ట్

‘శతమానం భవతి’ రెండురోజుల కలెక్షన్స్ రిపోర్ట్

Shatamanam Bhavathi two days collections report is out. According to trade report, this movie earning huge collections even in khaidi, satakarni competition.

సాధారణంగానే చిన్న సినిమాలకు తక్కువ కలెక్షన్లు నమోదవుతాయి. పండగవేళల్లో విడుదల అయినప్పుడు.. కాస్త ఎక్కువగా కలెక్ట్ చేస్తాయి. ఒకవేళ పోటీగా మరో చిత్రం రిలీజైతే మాత్రం.. ఆ పోటీలో రెండింటికి తక్కువ వసూళ్లే వస్తాయి. అదే పెద్ద సినిమా రిలీజైతే.. ఆ చిన్న సినిమా గల్లంతే. కానీ.. ‘శతమానం భవతి’ సినిమా మాత్రం రెండు పెద్ద సినిమాల భారీ పోటీలోనూ అనూహ్య కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ వర్గాల్నే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. తొలిరోజు (శనివారం) రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ.3.05 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా, రెండోరోజు (ఆదివారం) రూ.2.70 కోట్లు సాధించింది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి తొలిరోజు అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్‌ రావడం వల్లే.. భారీ పోరులోనూ ఈ రేంజ్ వసూళ్లు కలెక్ట్ చేస్తోందని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది టోటల్ రన్‌టైంలోపు డిస్ట్రిబ్యూటర్స్‌కి మంచి లాభాలు తెచ్చిపెడుతుందని అంటున్నారు.

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్‌లు జంటగా నటించిన ఈ చిత్రాన్ని వేగేశ్న సతీష్ తెరకెక్కించగా.. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రూ. 9 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా రెండురోజుల వసూళ్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)…

నైజాం : 1.98
సీడెడ్ : 0.67
నెల్లూరు : 0.16
కృష్ణా : 0.34
గుంటూరు : 0.47
వైజాగ్ : 0.89
ఈస్ట్ గోదావరి : 0.71
వెస్ట్ గోదావరి : 0.53
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 5.75 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news