Movies‘శతమానం భవతి’ 16 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ వివరాలు.. సత్తా చాటుతున్న...

‘శతమానం భవతి’ 16 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ వివరాలు.. సత్తా చాటుతున్న చిన్న సినిమా

Young hero Sharwanand latest family oriented film ‘Shatamanam Bhavati’ has earning very well at the worldwide boxoffice. According to trade report, this film has crossed 28 crore mark which is said to record in small movies categories.

‘శతమానం భవతి’.. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు చిన్న సినిమాగా వచ్చి, పెద్ద హిట్‌ అయ్యింది. బరిలో ఉన్న టాలీవుడ్ లెజెండ్స్ చిరు, బాలయ్యల ప్రతిష్టాత్మక ‘ఖైదీ నెం.150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాలను సైతం పూర్తిగా డామినేట్ చేసి.. బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. నిజానికి.. ఆ ఇద్దరి స్టార్ హీరోల సినిమాలపై నెలకొన్న అంచనాల్ని చూసి, ఈ చిన్న చిత్రం అడ్రస్ లేకుండా కొట్టుకుపోతుందని భావించారు. కానీ.. అందరి ఊహాగానాల్ని తిప్పికొడుతూ ఈ మూవీ అనూహ్య విజయం సాధించింది. ఆ రెండు చిత్రాలకు ధీటుగా పోటీనిస్తూ.. భారీ కలెక్షన్లతో దూసుకెళుతోంది.

‘శతమానం భవతి’ సినిమా రిలీజైనప్పుడు ఆ రెండు చిత్రాల హవానే కొనసాగుతుండడం.. ఇది తక్కువ కలెక్షన్లే కలెక్ట్ చేయగలిగింది. కానీ.. వీకెండ్ ముగిసిన తర్వాత ఈ చిత్రం రోజురోజుకు పుంజుకుంటూ వస్తోంది. రానురాను ఆ చిత్రాలనే వెనక్కు నెట్టేసి.. వీలైనంత డబ్బులు తన ఖాతాలో జమ చేసుకుంటూ వచ్చింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 28.51 కోట్లు కలెక్ట్ చేసింది. అందులో.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే రూ.24.90 కోట్లు కొల్లగొట్టడం నిజంగా ఆశ్చర్యకరం. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్నిచోట్లా పాజిటివ్ టాక్ రావడం వల్లే ఇలా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

నైజాం : 9.39
సీడెడ్ : 2.64
వైజాగ్ : 4.51
ఈస్ట్ గోదావరి : 2.60
వెస్ట్ గోదావరి : 1.79
కృష్ణా : 1.68
గుంటూరు : 1.72
నెల్లూరు : 0.57
ఏపీ+తెలంగాణ : రూ. 24.90 కోట్లు
యూఎస్ఏ : 2.06
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా + రెస్టాఫ్ వరల్డ్ : 1.55
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 28.51 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news