Movies‘శతమానం భవతి’ 13 రోజుల కలెక్షన్స్.. చరిత్ర సృష్టించిన శర్వానంద్

‘శతమానం భవతి’ 13 రోజుల కలెక్షన్స్.. చరిత్ర సృష్టించిన శర్వానంద్

Sharwanand’s latest movie ‘Shatamanam Bhavati’ has earned massive collections in just 13 days it’s run at the boxoffice which is said to record among young heroes.

స్టార్ హీరోలకు 50 కోట్ల నుంచి డ్రీమ్ మార్క్ స్టార్ట్ అయితే.. యంగ్ హీరోలకు 20 కోట్లనుంచే ప్రారంభం అవుతుంది. నిజానికి.. ఈ కథానాయకుల మార్కెట్ వ్యాల్యూ చాలా తక్కువ. అందుకే.. వీరి మూవీలు రూ.20 కోట్ల మార్క్‌ని క్రాస్ చేయడమే పెద్ద విశేషంగా భావిస్తారు. అది కూడా వాళ్లు సోలోగా వస్తేనే అది సాధ్యమవుతుంది. ఒకవేళ పెద్ద సినిమా పోటీగా దిగితే మాత్రం.. ఆ యంగ్ హీరోల మూవీలు అతికష్టం మీద 10 కోట్లు రాబడుతాయి. వీలైతే 15 కోట్లు మార్క్‌ని క్రాస్ చేస్తాయంతే. కానీ.. తొలిసార శర్వానంద్ ఏ యంగ్ హీరోకి సాధ్యంకాని అరుదైన ఫీట్ సాధించాడు.

సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ‘శతమానం భవతి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వానంద్.. టాలీవుడ్ లెజెండ్స్ బాలయ్య, చిరుల ప్రతిష్టాత్మక చిత్రాలకు ధీటుగా పోటీనిస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.20 కోట్ల మార్క్‌ని క్రాస్ చేసి.. చరిత్ర సృష్టించాడు. అది కూడా 13 రోజుల్లోనే ఆ ఫీట్‌ని అందుకోవడం విశేషం. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఏపీ, తెలంగాణాల్లో కలుపుకుని 13 రోజుల్లో రూ.21.80 కోట్లు కొల్లగొట్టింది. అందులో.. నైజాంలోనే ఈ చిత్రానికి రూ.8.05 కోట్లు రావడం మరో విశేషం. దీన్ని బట్టి.. ఈ సినిమా ఆడియెన్స్‌ని ఏ రేంజులో మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు.

ఏరియాల వారీగా 13 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 8.05
సీడెడ్ : 2.21
ఉత్తరాంధ్ర : 4.08
గుంటూరు : 1.46
ఈస్ట్ గోదావరి : 2.37
వెస్ట్ గోదావరి : 1.66
కృష్ణా : 1.47
నెల్లూరు : 0.50
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 21.80 కోట్లు (షేర్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news