Moviesఆ విషయంలో ఖైదీ, శాతకర్ణిల కంటే ముందు వరుసలో నిలిచిన శర్వానంద్

ఆ విషయంలో ఖైదీ, శాతకర్ణిల కంటే ముందు వరుసలో నిలిచిన శర్వానంద్

Sharwanand’s latest film Satamanam Bhavathi completes censor formalities before Khaidi No 150 and Gautamiputra Satakarni.

టాలీవుడ్ లెజెండ్స్ అయిన చిరంజీవి, బాలయ్యల ప్రతిష్టాత్మక సినిమాలు ‘ఖైదీ’, ‘శాతకర్ణి’ రెండూ సంక్రాంతికి భారీఎత్తున రిలీజ్ అవుతుండడం.. అది కూడా చాలాకాలం తర్వాత వారిమధ్య పోటీ నెలకొంటుండడంతో.. ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారా? అని ఇండస్ట్రీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా.. వారి సినిమాలే గురించి చర్చించుకుంటున్నారు. అయితే.. వీరిద్దిరి గురించి తనకేం సంబంధం లేదన్నట్లుగా శర్వానంద్ తన చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేస్తూ.. సంక్రాంతి బరిలో దింపేందుకు రెడీ అవుతున్నాడు.

విశేషం ఏంటంటే.. ఆ ఇద్దరి లెజెండ్స్ సినిమాలకంటే ముందు తన సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్‌ని ముగించేశాడు. రీసెంట్‌గానే యూనిట్ సెన్సార్‌కి తమ చిత్రాన్ని తీసుకెళ్లగా.. వాళ్లు దీనికి క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేశారు. అంతేకాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని అలరించే విధంగా సినిమాని చాలా చక్కగా తెరకెక్కించారని పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ కూడా సెన్సార్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో.. సంక్రాంతికి రాబోయే సినిమాల్లో సెన్సార్ పనులు ముగించుకున్న మొదట చిత్రంగా నిలిచింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా ఫినిష్ అయిపోవడంతో.. ఈ మూవీ విడుదలకు అన్నీ అడ్డంకులు తొలగిపోయినట్లే. ముందుగా ప్రకటించినట్లు జనవరి 14న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓవైపు చిరు, బాలయ్యల మధ్య ఎవరు విజయకతనం ఎగరేస్తారా? అని ఇండస్ట్రీ జనాలు టెన్షన్ పడుతుంటే.. మరోవైపు శర్వానంద్ మాత్రం చాలా కూల్‌గా తన చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు. మరి.. ఆ భారీ పోరులో శర్వానంద్ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news