Gossipsఆ స్టార్ హీరో కొడుకు తో అర్జున్ రెడ్డి హీరోయిన్

ఆ స్టార్ హీరో కొడుకు తో అర్జున్ రెడ్డి హీరోయిన్

ఒన్ ఫిల్మ్ వండ‌ర్ అర్జున్ రెడ్డి సినిమాతో అంద‌రినీ ఆక‌ట్టుకుంది షాలిని పాండే. ఈ  అనూహ్య రీతిలో విజ‌య‌వంతం కావ‌డంతో ప్ర‌స్తుతం ఈమెకు వ‌రుస అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం ఈమె నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సావిత్రి బ‌యోపిక్ మ‌హాన‌టిలో న‌టిస్తోంది.

దీంతోపాటు ‘100% లవ్‌’ తమిళ్‌ రీమేక్‌లో తమన్నా పాత్రకు సంతకం చేశారు. కాగా ఇప్పుడు మరో అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చినట్లు చిత్ర వర్గాల సమాచారం.‘ఓకే బంగారం’ ఫేం దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం దర్శక, నిర్మాతలు షాలినిని సంప్రదించినట్టు తెలుస్తోంది.

అయితే ఆమె నటించేందుకు సంతకం చేశారో, లేదో తెలియాల్సి ఉంది.ఈ చిత్రంలో ఇద్దరు, ముగ్గరు కథానాయికలకు చోటుందట. ఓ రోడ్డు ట్రిప్‌ చుట్టూ కథ సాగనున్నట్లు సమాచారం. ఒకే ఒక్క సినిమాతో రెండు ఇండ‌స్ట్రీల‌ను ఏలే ఛాన్స్ కొట్టేసింది ఈ పిల్ల‌.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news