Moviesషకలక శంకర్ "డ్రైవర్ రాముడు" టీజర్.. కలర్ ఫుల్ కామెడీ అదరగొట్టాడుగా..!(వీడియో)

షకలక శంకర్ “డ్రైవర్ రాముడు” టీజర్.. కలర్ ఫుల్ కామెడీ అదరగొట్టాడుగా..!(వీడియో)

జబర్దస్త్ ఫేం షకలక శంకర్ కామెడీ అందరికి తెలిసిందే. ఈమధ్య కాలంలో బుల్లితెర నుండి సిల్వర్ స్క్రీన్ ను ప్రమోట్ అయిన వారిలో షకలక శంకర్ ఒకరు. అంతేకాదు కొన్ని సినిమాల్లో కామెడీ పాత్రలు చేశాడో లేదో ఇప్పుడు సోలో హీరోగా రంగంలో దిగుతున్నాడు. ఇప్పటికే శంభో శంకర అంటూ ఓ సీరియస్ సబ్జెక్ట్ తో వస్తున్న షకలక శంకర్ ఇప్పుడు డ్రైవర్ రాముడుగా రాబోతున్నాడు.

రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను అలరిస్తుంది. శంకర్ మార్క్ కామెడీతో స్టైలిష్ గా ఈ టీజర్ కట్ చేశారు. రాజ్ సత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను వేణుగోపాల్, రాజు, కిషన్, నిర్మిస్తున్నారు. షకలక శంకర్ కు జోడీగా అంచల్ సింగ్ నటిస్తుంది. టీజర్ అయితే కలర్ఫుల్ గా ఉంది.. కామెడీ ఎంటర్టైనర్ గా కచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అవకాశం కనిపిస్తుంది.

అయితే సినిమాలో ఏదో ఒక 3, 4 సీన్స్ లో వచ్చే షకలక శంకర్ రెండు గంటల సినిమా మొత్తం ఎంటర్టైన్ చేయగలడా అన్నది చూడాలి. ఒకవేళ ఈ ప్రయత్నం సక్సెస్ అయితే శంకర్ హీరోగానే కంటిన్యూ చేస్తాడని అంటున్నారు. అయితే సునీల్ కూడా ఇలానే తనకు వచ్చిన క్రేజ్ ను సోలోగా నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాడు మొదట పర్వాలేదు అనిపించినా మళ్లీ హీరోగా హిట్లు లేక కమెడియన్ గా మారాల్సిన పరిస్థితి వచ్చింది. షకలక శంకర్ అలా చేయకుండా హీరోగా చేస్తూనే కమెడియన్ గా కంటిన్యూ చేయడం బెటర్ అని అంటున్నారు సిని విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news