Gossipsఎన్టీఆర్- షకలక శంకర్... ఏమైనా వివాదమా ?

ఎన్టీఆర్- షకలక శంకర్… ఏమైనా వివాదమా ?

జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయిన కమెడియన్ షకలక శంకర్ మొన్నటిదాకా సినిమాల్లో కామెడీ వేషాలు వేస్తూ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు శంకర్ హీరోగా ప్రమోట్ అవుతూ వస్తున్న సినిమా డ్రైవర్ రాముడు. సీనియర్ ఎన్.టి.ఆర్ సూపర్ హిట్ సినిమా అయిన ఈ డ్రైవర్ రాముడు టైటిల్ తో షకలక శంకర్ వస్తుండటం విశేషం. అంతేకాదు షూటింగ్ జరుపుకుంటుంది అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా శంకర్ ఎన్టీవోడి గెటప్ లోనే ఉన్నాడు.

తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్లు హీరోగా కొత్త టర్న్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి వారికి సునీల్ స్పూర్తిగా నిలవగా ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి కూడా ఆ దారిలో నడుస్తున్నాడు. మొత్తానికి డ్రైవర్ రాముడిగా షకలక శంకర్ తన ప్రతాపం చూపిస్తాడని తెలుస్తుంది. సినిమాలో తన కొద్దిసేపు కామెడీతోనే కడుపుబ్బా నవ్వించే షకలక శంకర్ సినిమాలో లీడ్ రోల్ తానే అయితే ఎలా ఉంటుందో చూడాలి.

రాజ్ సత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈమధ్యనే సప్తగిరి కూడా హీరోగా మారి సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా చేశాడు మరి షకలక శంకర్ ఈ డ్రైవర్ రాముడు సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news