Moviesబయోపిక్ నుంచి ఎన్టీఆర్ ను పక్కన పెట్టేసారా..?

బయోపిక్ నుంచి ఎన్టీఆర్ ను పక్కన పెట్టేసారా..?

నందమూరి నట సింహం బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు బయోపిక్ ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. విశ్వవిఖ్యాత నటసార్వ భౌమ జీవిత చరిత్ర ఎలా ఉండబోతుందో అని అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక మరో పక్క సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఎన్.టి.ఆర్ బయోపిక్ డైరక్టర్ తానే అని ఎనౌన్స్ చేశాడు.

వర్మ ఎనౌన్స్ మెంట్ పై బాలయ్య ఎలాంటి రెస్పాన్స్ అందించలేదు. అయితే ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఎన్.టి.ఆర్ బయోపిక్ కు ప్రస్తుతానికి బ్రేకులు పడ్డాయట. ఎన్.టి.ఆర్ జీవిత చరిత్ర తీయాలంటే మంచి చెడులన్ని చూపించాల్సి ఉంది. అందుకే ప్రస్తుతం రానున్న ఎన్నికల ముందు ఇలాంటి ప్రయోగాలు ఎందుకని బాలయ్య తన సొంత నిర్ణయంతో ఈ సినిమాను అటకెక్కించేశాడట.

వర్మతో చేసే ఉద్దేశం లేకనే సినిమా ఆపేస్తున్నారని కొందరి మాట. ఏది ఎలా ఉన్నా తెలుగు జాతి గర్వడేలా తెలుగు తెర మీద నవరస కళాపోషణ ప్రతిభింబించిన ఎన్.టి.ఆర్ జీవిత చరిత్ర చూడాలన్న కోరిక నందమూరి అభిమానులకు బలంగా ఉంది. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news