Newsఇన్ఫోసిస్ ఆఫీస్‌లోనే దారుణహత్యకు గురైన లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. చంపింది అతడే!

ఇన్ఫోసిస్ ఆఫీస్‌లోనే దారుణహత్యకు గురైన లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. చంపింది అతడే!

A security guard, Bhaben Saikia has been arrested for allegedly killing a 25-year-old software engineer Rasila Raju in Pune.

అమ్మాయిలకు బయటే కాదు.. ఇళ్లు, ఆఫీసులలో కూడా రక్షణ లేకుండా పోయింది. అక్కడ కూడా కిరాతకులు వారిని వదిలిపెట్టడం లేదు.. దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ మహిళా టెక్కీ తాను పనిచేస్తున్న కార్యాలయంలోనే హత్యకు గురి కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన పూణేలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఆనంద కె.రాసిలా రాజు పూణేలోని రాజీవ్ మహాత్మగాంధీ ఇన్ఫోటెక్ పార్క్ కార్యాలయం పని చేస్త్తోంది. ఇన్ఫోసిస్ భవనంలోని తొమ్మిదవ అంతస్తులో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో బెంగుళూరుకి చెందిన తన టీమ్‌తో ఈమె ఆన్‌లైన్‌లో విధులు నిర్వర్తిస్తోంది. ఆ టైంలో సెక్యూరిటీ గార్డు భాబేన్ సైక్యా లోనికి వచ్చి.. ఆమెవైపే చూడసాగాడు. అలా చూడొద్దని రాసిలారాజు చెప్పినా.. అతడు వినలేదు. దీంతో.. తాను పై అధికారులకు కంప్లైంట్ చేస్తానని ఆమె చెప్పింది. దాంతో భయాందోళనకు గురైన గార్డు.. తనపై కంప్లైంట్ చేయొద్దని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొనగా.. అక్కడే ఉన్న వైర్లు ఆమె మెడకు బిగించి.. హత్య చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి జారుకున్నాడు.

దాదాపు అదే టైంలో మేనేజర్ రాసిలారాజుకు ఫోన్ చేయగా.. ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో.. మేనేజర్ సెక్యూరిటీ గార్డులను అలర్ట్ చేశాడు. అప్పుడు ఓ గార్డ్ లోనికి వెళ్లి చూడగా.. ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి, మేనేజర్‌కి ఆ విషయాన్ని తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా.. ఈ హత్య చేసింది సెక్యూరిటీ గార్డు భాబేన్ సైక్యా అని నిర్ధారణకు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లుగా పూణే అసిస్టెంట్ కమిషనర్ వైశాలి జాదవ్ చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news