Gossipsకొత్త ట్విస్ట్.. అసలు హీరోయిన్ పూజ కాదట..!

కొత్త ట్విస్ట్.. అసలు హీరోయిన్ పూజ కాదట..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాలో పూజా హెగ్దె లక్కీ ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్ గా ఎన్.టి.ఆర్ బర్త్ డే నాడు ఓ స్టిల్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోల్ కు ముందు సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ ను అనుకున్నా ఆమె ఎందుకో కాదన్నది.

ఇక ఈ పాత్రలో తెలుగమ్మాయి ఈషా రెబ్బ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈషా.. ఆమి తుమి, అ! సినిమాలతో ప్రతిభ చాటుకుంది. ఎన్.టి.ఆర్ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న అరవింద సమేతలో ఫ్లాష్ బ్యాక్ లో ఈషా కనిపించనుందట.

కచ్చితంగా ఈషాకు ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎన్.టి.ఆర్ సినిమాలో సెకండ్ లీడ్ గా నటించడం అంటే మాములు విషయం కాదు. టాలెంట్ ఎక్కడ ఉన్నా తగిన అవకాశం ఇచ్చే తారక్ తన సినిమాలో తెలుగు అమ్మాయికి పిలిచి మరి అవకాశం ఇస్తున్నాడు. మరి ఈ క్రేజీ ఛాన్స్ ను ఈషా ఏవిధంగా వినియోగించుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news