Movies‘ఎక్స్‌ప్రెస్’ సినిమాకి సప్తగిరికి ముట్టింది కేవలం ‘జీరో’

‘ఎక్స్‌ప్రెస్’ సినిమాకి సప్తగిరికి ముట్టింది కేవలం ‘జీరో’

Comedian turned hero Saptagiri has not taken single rupee for ‘Saptagiri Express’ movie. He explained the reason why. Read below article to know more details.

సాధారణంగా నటీనటులు ఓ స్థాయి నుంచి మరో స్థాయికి ఎదిగితే.. తమ పారితోషికం భారీగా పెంచేస్తారు. తమ క్రేజ్, డిమాండ్‌ని బట్టి.. నిర్మాతలే వారికి మంచి అమౌంట్ ముట్టజెప్తారు. కానీ.. రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేసే సెలబ్రిటీలు చాలా అరుదు. అలాంటివారి జాబితాలో కమెడియన్ సప్తగిరి కూడా చేరిపోయాడు. కథానాయకుడిగా నటించిన తొలిచిత్రానికి ఈ కామెడీ హీరో నయా పైసా కూడా తీసుకోలేదు. అవును.. మీరు చదువుతోంది నిజమే. ఇండస్ట్రీలో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన ఈ హీరో.. హీరోగా నటించిన మొదటి సినిమాకి అసలు డబ్బులే తీసుకోలేదు.

నిజానికి.. ఈ సినిమా కోసం సప్తగిరి చాలా కష్టపడ్డాడు. స్ర్కిప్టులోనూ తనవంతు సహకారం అందించాడు. గతంలో మునుపెన్నడూ లేనంతగా ఇందులో డ్యాన్సులు, యాక్షన్ సీన్లలో ఇరగదీసి నటించాడు. ఓవరాల్‌గా.. తన భుజాలపైనే ఈ చిత్రాన్ని నడిపించాడు. అలాంటిది.. ఇతినికి భారీగానే డబ్బులు ముట్టి ఉంటాయని ఎవరైనా అనుకోవడం సహజం. కానీ.. అతడు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సప్తగిరి వెల్లడించాడు. తాను హీరోగా సినిమా తీయడానికి నిర్మాత రవికిరణ్ ముందుకు రావడమే గొప్ప విషయమని.. అందుకే తనకు ఇచ్చే పారితోషకాన్ని నిర్మాత సినిమాకు ఖర్చు చేసుకుంటాడన్న ఉద్దేశంతో డబ్బులు తీసుకోలేదని తెలిపాడు. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. తమిళంలో హిట్ అయిన ‘తిరుడన్ పోలీస్’ను రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా అతడిదేనట.

తెలుగు నేటివిటీకి తగ్గట్లు సినిమాలో మార్పులు చేయడంలోనూ అతని భాగస్వామ్యం ఉంది. అందుకే.. ‘అడిషనల్ స్క్రీన్ ప్లే’ క్రెడిట్ కూడా తీసుకున్నాడు. డబ్బులు తీసుకోకుండా డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఫ్రీగా చేయడానికి ముందుకు రాని ఈరోజుల్లో.. సప్తగిరి తన పారితోషికం తీసుకోకుండా సినిమానే ముఖ్యమని అన్నీ తానై పనిచేసినందుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news