Gossipsసంక్రాంతికి పందెం కోళ్లు వీళ్లే..!

సంక్రాంతికి పందెం కోళ్లు వీళ్లే..!

2018 సంక్రాంతికి రిలీజ్ సినిమాలు ఎన్ని అన్న లెక్క దాదాపు కన్ఫాం అయినట్టే. ఇయర్ స్టార్టింగ్ తో పాటుగా సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్ బాక్సాఫీస్ కు కలక్షన్ల జాతర అన్నట్టే. సంక్రాంతి రాజుగా చివరకు ఎవరు విజయాన్ని సాధిస్తారో చూడాలి. ఈ సంక్రాంతి బరిలో పవర్ స్టార్ దమ్ముచూపించబోతున్నాడు. త్రివిక్రం డైరకషన్ లో పవన్ కళ్యాణ్ నటించిన 3వ సినిమా ఇది.
ఈ సినిమా సాంగ్స్.. టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సంక్రాంతికి సినిమా మిస్ అవ్వని బాలయ్య ఈ పొంగల్ కు జై సింహా గా రాబోతున్నాడు. నందమూరి నటసింహానికి సంక్రాంతికి పెద్ద లెక్కే ఉంది. ఈ సంక్రాంతికి ఆ హిట్ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఇక సంక్రాంతికి రాజ్ తరుణ్ రాజుగాడు సినిమా కూడా రాబోతుంది.
గత రెండు సంవత్సరాల్లో పెద్ద సినిమాలతో పోటీ పడి విజయం సాధించిన చిన్న సినిమాలను స్పూర్తిగా తీసుకుని రాజుగాడు సినిమాతో వస్తున్నారు. ఇదే కాకుండా సూర్య హీరోగా వస్తున్న గ్యాంగ్ సినిమా కూడా భారీగానే రిలీజ్ అవుతుంది. మొత్తానికి సంక్రాంతి పందెం కోళ్లు ఎలా పోటీలో దిగుతాయో ఈ నాలుగు సినిమాలు పోటీకి వస్తున్నాయి. వీటిలో ఏ సినిమా విజయ పతాకం ఎగురవేస్తుందో చూడాలి.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news