Newsసానియాను గిల్లిన క్రికెటర్.. తన రిప్లై చూస్తే దిమ్మ దిరగాల్సిందే!!

సానియాను గిల్లిన క్రికెటర్.. తన రిప్లై చూస్తే దిమ్మ దిరగాల్సిందే!!

గిల్లడం అంటే మీరు అనుకునే గిల్లడం కాదండోయ్. ఇది ఇంకో రకం గిల్లుడు. పబ్లిసిటీ కోసం నలుగురిలో కాస్తంత గొప్పగా చెప్పుకునే ప్రయత్నాలు సానియా మీర్జాకు అలవాటే. ఆ మధ్యకాలంలో తనతో పాటే క్రేజ్ తెచ్చుకుంటున్న సైనా నెహ్వాల్ ప్రతిభను కాస్త తగ్గించి మాట్లాడి తన టాలెంట్ గురించి కాస్త ఎక్కువ చెప్పుకుంది కూడా అందుకే. ఇప్పుడు కూడా అలాంటి ఓ చిన్న ప్రయత్నం చేసింది. మిగతా అందరూ కూడా కంగ్రాట్స్…కంగ్రాట్స్ అన్నారు. కానీ మంజ్రేకర్ మాత్రం ఓ చిన్న గిల్లుడు గిల్లాడు.

నంబర్ ఒన్ క్రీడాకారిణిగా 80వారాలు పూర్తి చేసుకున్నానని సానియా మీర్జా చాలా సంతోషంగా ట్వీట్ చేసింది. అందరూ అభినందించారు. అయితే సచిన్‌తో సహా ఇప్పటికే చాలా మంది విషయంలో కాస్త ఘాటుగా నిజాలు మాట్లాడి ఉన్న మంజ్రేకర్ సానియా మీర్జా ట్వీట్‌కి అంతే ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ‘నువ్వంటోంది నంబర్ ఒన్ డబుల్స్ క్రీడాకారిణి అనే కదా…కంగ్రాట్స్’ అని ట్వీట్ చేశాడు మంజ్రేకర్. ఆ ఆట గురించి తెలిసినవాళ్ళకు మంజ్రేకర్ పేల్చిన సెటైర్ ఏంటో వెంటనే అర్థమవుతుంది. నిజానికి టెన్నిస్‌లో డబుల్స్‌కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. ఏదో సెకండ్ గ్రేడ్ గేమ్‌లో చూస్తారు. అయితే సానియా మాత్రం డబుల్స్‌లో నంబర్ ఒన్ అని చెప్పకుండా నంబర్ ఒన్ అని చెప్పేసుకుంది. దాంతో మంజ్రేకర్ ఆమె కీర్తి కండూతిని బయటపెట్టేశాడు. అఫ్కోర్స్..చిర్రెత్తిన సానియా కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అయింది. సింగిల్స్ నంచి ఎప్పుడో రిటైర్ అయ్యాను కాబట్టి ఇక మిగిలింది డబుల్సే కదా. అయినా మీడియా వాళ్ళు కూడా అలాగే రాస్తున్నారు అంటూ ఓ పేపర్ కట్టింగ్‌ని సాక్ష్యంగా పోస్ట్ చేసింది. ఆ తర్వాత మాత్రం మంజ్రేకర్ ఎందుకో తగ్గాడు. ఎనీ హౌ కంగ్రాట్స్ అన్నాడు. సానియా కూడా అభినందనలకు మాత్రం థ్యాంక్స్ అని చెప్పింది.అప్పట్లో సైనా నెహ్వాల్ విషయంలో సానియా చేసిన పనినే ఇప్పుడు మంజ్రేకర్ సానియా విషయంలో చేశాడని విశ్లేషకులు చెప్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news