Gossipsఆ హ్యాంగోవర్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా..?

ఆ హ్యాంగోవర్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా..?

ఎన్నో సంచలనాలు .. ఎన్నో వివాదాలకు తెర తీసి చివరకి బాక్సఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సినిమా ‘ అర్జునరెడ్డి ‘ ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా సంచలన విజయం సాధించడంతో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాపై అందరి దృష్టిపడింది. ఈ డైరెక్షర్ కి ఉన్న ప్రతిభకి రాంగోపాల్ వర్మ లాంటి దర్శకులే ఆశ్చర్యపోయారు.

అర్జున్‌రెడ్డి తర్వాత తదుపరి చిత్రంపై ఇంకా సమయం తీసుకొంటున్న సందీప్ వంగా తాజాగా రాంచరణ్‌తో ఉన్న ఫోటోలు బయటకి రావడంతో అందరిలోనూ ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే సందీప్ తన తరువాతి చిత్రంలో హీరోగా ఇప్పటికే శర్వానంద్ ను ఎంపిక చేసుకున్నాడు. అయితే… సందీప్ దర్శకత్వం వహించబోయే సినిమాలో ఇంకెవరన్నా హీరో ఉన్నారా అనే సందేహం ఇప్పుడు అందరిలోనూ కలుగుతోంది.

రామ్ చరణ్ హీరోగా సందీప్ వంగా తన తరువాతి చిత్రానికి సంబంధించిన కథను సిద్ధం చేస్తున్నట్టు గత కొద్దికాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. సందీప్ డైరెక్షన్‌లో వచ్చే చిత్రాన్ని సొంత బ్యానర్‌లో రూపొందించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

చరణ్ వైఫ్ ఉపాసన తయారు చేసిన క్రిస్మస్ ట్రీ దగ్గర చరణ్, సందీప్ రెడ్డి, శర్వానంద్, యూవీ క్రియేషన్స్ పార్ట్నర్ విక్కీ కలిసి ఫోటో దిగారు. చరణ్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో త్వరలో చరణ్ సినిమా తీయబోతున్నాడనే ఊహాగానాలు మొదలయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news