Newsబిగ్ బాస్ నుండి సంపూర్ణేష్ నిష్క్రమణ.. సంపూ కంపు చేశాడుగా..!

బిగ్ బాస్ నుండి సంపూర్ణేష్ నిష్క్రమణ.. సంపూ కంపు చేశాడుగా..!

ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ షో నుండి సంపూర్ణేష్ నిష్క్రమించడం జరిగింది. అదేంటి వారానికి ఒకసారే కదా ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగేది అయినా జ్యోతి బిగ్ బాస్ హౌజ్ వీడి రెండు రోజులే అవుతుంది కదా అని అనుకోవచ్చు ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ హౌజ్ అక్కడ పరిస్థితులు సంపూర్ణేష్ ను శారీరక మానసిక ఆందోళణలో పడేసాయి.

మొదట కెప్టెన్ గా భాధ్యతలను నిర్వర్తించిన సంపూర్ణేష్ ఆ తర్వాత కెప్టెన్సీ సరిగా చేయట్లేదని అతని ప్లేస్ లో కల్పనకు కెప్టెన్సీ అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌజ్ లో సంపూర్ణేష్ మరింత భయాందోళను గురవడం బిగ్ బాస్ కెమెరా ముందు విరుచుకు పడటం జరిగింది. ఇక సంపూర్ణేష్ బాధని చూడలేక కన్ఫెషన్ రూం కు పిలిపించి బిగ్ బాస్ రూల్స్ ను పక్కన పెట్టి మరి సంపూర్ణేష్ ను బయటకు పంపించేశారు.

రీల్ లైఫ్ హీరోగా అనిపించుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ రియల్ లైఫ్ లో మాత్రం ఓ వారం రోజులు అది కూడా సాటి కంటెస్టంట్స్ లో ఉండలేకపోయాడు. బిగ్ బాస్ తెలుగులో అసలే ప్రోగ్రాం నత్త నడక నడుస్తుంది అనుకుంటుంటే సంపూర్ణేష్ చేసిన పనికి స్టార్ మాతో పాటు బిగ్ బాస్ నిర్వాహకులు కూడా షాక్ అయ్యారని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news