Gossipsప్రభాస్ సినిమా సెట్లో బ్యాడ్మింటన్ స్టార్

ప్రభాస్ సినిమా సెట్లో బ్యాడ్మింటన్ స్టార్

ఆమె ఓ స్టార్ షట్ల‌ర్‌.. నిండైన వ్య‌క్తిత్వానికి ప్ర‌తీక.. దేశం కోసం ఆడ‌డ‌మే త‌న తొలి ప్రాధాన్యం అని చెబుతుంది. ఆయ‌న ఓ స్టార్‌.. దేశం గ‌ర్వించే ద‌గ్గ సినిమాలో శ‌క్తి వంచ‌న లేకుండా న‌టించి తానేంటో నిరూపించాడు.వారే ఒక‌రు సైనా ఇంకొక‌రు ప్ర‌భాస్‌. తొలిసారిగా వీరిరువురూ క‌లుసుకున్నారు.

అంతే కెమెరా క‌ళ్లు క్లిక్ మ‌నిపించాయి.ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న ‘సాహో’ సెట్‌ను సైనా, ఆమె తల్లిదండ్రులతో స‌హా సందర్శించి, ఆ.. ఆనందాన్ని పంచుకుంది.‘బాహుబలి ప్రభాస్‌తో..’ అని ట్వీట్ చేసి అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురిచేసింది.సాధార‌ణంగా సైనా సినిమా స్టార్ల‌తో ఫొటోలకు ఫోజులివ్వ‌డం అరుదు.  వెరీ రిజ‌ర్వ్‌గా ఉండే ఈ అమ్మాయిలో ఏంటో ఈ మార్పు. బ‌హుశా! బాహుబ‌లి సిన్మా ఈమె అంత‌గా న‌చ్చి ఉండాలి. అన్న‌ట్లు త్వ‌ర‌లో సైనా జీవిత క‌థ‌తో బ‌యోపిక్ బాలీవుడ్‌లో తెర‌కెక్క‌నుంది.

ఇప్ప‌టికే మేరీకోమ్, ధోనీ జీవిత క‌థ‌లు తెర‌కెక్కి ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి.ఈ కోవ‌లోనే సైనా బ‌యోపిక్ కూడా రానుండ‌డం విశేషం. ఇందులో రీల్ లైఫ్ సైనాగా శ్ర‌ద్ధా క‌పూర్ న‌టిస్తోంది. ఈమెనే సాహో సినిమాలో హీరోయిన్‌.అంతేనా ఈ సినిమా కోసం సైనా దగ్గ‌ర బ్యాడ్మింట‌న్ లో శిక్ష‌ణ తీసుకుంటుంది.వ‌చ్చే ఏడాది ఈ సిన్మా విడుద‌ల కానుంది.ఈ సిన్మా రేప‌టి త‌రం క్రీడాకారుల్లో త‌ప్ప‌క స‌రికొత్త స్ఫూర్తిని నింపుతుంద‌ని ఆశిద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news