Gossipsఆ కష్టం నుండి బయటపడేసింది అతనే..!

ఆ కష్టం నుండి బయటపడేసింది అతనే..!

ప్రస్థానం సినిమాలో నెగటివ్ రోల్ చేసిన సందీప్ కిషన్ స్నేహగీతం సినిమాలో సినిమా పిచ్చి ఉన్నవాడిగా నటించి మెప్పించాడు. ఇక సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాక కెరియర్ ఏదో సోసోగా నడిపిస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, టైగర్ లాంటి హిట్లు కొట్టినా సందీప్ కిషన్ ఓ సరైన ఇమేజ్ సంపాదించుకోలేదు. అయితే ఇండస్ట్రీ మనిషి కాబట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

ఇక రీసెంట్ గా తెలుగు తమిళ భాషల్లో వచ్చిన కేరాఫ్ సూర్య సినిమాతో హిట్ అందుకున్న సందీప్ కిషన్ తన కష్టకాలంలో సాయి ధరం తేజ్ చాలా సహాయం అందించాడని అన్నాడు. కెరియర్ సంక్షోభంలో ఉన్నప్పుడు తేజ్ నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచాడు. ఆ కష్టం నుండి బయటపడేలా చేసింది అతనే అంటున్నాడు సందీప్ కిషన్. ఇక కేరాఫ్ సూర్య సినిమాతో హిట్ కొట్టిన సందీప్ తమిళంలో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు.

ఇక తెలుగులో మాత్రం ఇంకా సెట్ రైట్ అవలేదని చెప్పాలి. కేరాఫ్ సూర్య ఎలాగు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఇక రానున్న సినిమాలతో అయినా సందీప్ కిషన్ ఓ మంచి ఇమేజ్ సంపాదిస్తాడేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news