Movies‘విన్నర్’ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్.. అదరగొట్టిన మెగాహీరో

‘విన్నర్’ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్.. అదరగొట్టిన మెగాహీరో

Supreme hero Sai Dharam Tej’s latest movie ‘Winner’ have done massive business around the world which is record in his career. According to trade, the total pre release business of Winner has touched the 30 Crore mark.

మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ చేసింది కేవలం 5 సినిమాలే అయినా.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించాడు. ‘మెగా’ ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చి.. ‘సుప్రీం’గా పేరు సంపాదించుకున్నాడు. యువహీరోలందరిలో తనకూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ క్రేజ్ కారణంగానే అతని లేటెస్ట్ ఫిల్మ్ ‘విన్నర్’ భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రికార్డ్ స్థాయిలో ధర పలికాయి.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 30 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇది ఈ మెగాహీరో కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఫిగర్. కేవలం నైజాం ఏరియాలో ఈ చిత్రం రైట్స్ రూ. 6.3 కోట్ల మేర అమ్ముడుపోవడం విశేషం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 2.5 కోట్లకు సోల్డ్ అయ్యాయి. స్టార్ హీరోల సినిమాల రేంజులో ఈ చిత్రం హిందీ రైట్స్ పలకడం చూస్తే.. అక్కడ సాయికి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఈ మూవీ శాటిలైట్ రైట్స్‌ని ఏకంగా రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది కూడా తేజ కెరీర్‌లో రికార్డ్ ఫిగర్. ఇక ఓవర్సీస్‌తోపాటు మిగిలిన ఏరియాలన్ని కలుపుకుంటే.. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ. 30 కోట్ల మేర ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందని ట్రేడ్ నిపుణులు పేర్కొన్నారు.

నిజానికి.. సాయి నటించిన ‘తిక్క’ సినిమా అతిపెద్ద డిజాస్టర్‌గా అవ్వడంతో, అతని క్రేజ్ కూడా తగ్గిందని అనుకున్నారు. దాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే.. కాస్త సమయం పడుతుందని భావించారు. కానీ.. అతని స్థాయి ఏమాత్రం తగ్గలేదని, ఇంకా పెరిగిందని ‘విన్నర్’ నిరూపించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాలోని ఓ పాట టీజర్‌ని ప్రిన్స్ మహేష్‌బాబు రీసెంట్‌గానే విడుదల చేశాడు.

ఏరియాల వారీగా బిజినెస్ డీటైల్స్ (కోట్లలో) :
నైజాం : 6.3
సీడెడ్ : 4
ఉత్తరాంధ్ర : 2.7
ఈస్ట్ గోదావరి : 1.80
వెస్ట్ గోదావరి : 1.50
నెల్లూరు : 1.08
శాటిలైట్ రైట్స్ : 5
హిందీ రైట్స్ : 2.5
ఓవర్సీస్‌తోపాటు ఇతర ఏరియాలన్నీ కలుపుకుని రూ.30 కోట్ల మేర బిజినెస్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news