Gossipsపవర్ స్టార్ సపోర్ట్ కోసం మేనల్లుడు..!

పవర్ స్టార్ సపోర్ట్ కోసం మేనల్లుడు..!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కరుణాకరణ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫలితం సాయి ధరం తేజ్ కెరియర్ మీద చాలా వరకు ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం కెరియర్ కాస్త అటు ఇటుగా నడుస్తున్న ఈ సమయంలో మెగా మేనళ్లుడు సినిమాల సలహాలు సూచనల కోసం మేనమామ పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకోనున్నాడట.

కరుణాకరణ్ సినిమా కాబట్టి పవన్ తో ఆ డైరక్టర్ కు మంచి సాన్నిహిత్యమే ఉంది. అందుకే ఈ సినిమా కోసం పవన్ ను ఫుల్ గా వాడేయాలని చూస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ దగ్గర నుండి టీజర్, ట్రైలర్, ఆడియో ఇలా అన్నిటిలో పవన్ ప్రమేయం ఉండేలా అతని చేతుల మీదగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.

అయితే వీరి వర్షన్ ఇలా ఉంటే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో పొలిటికల్ మూడ్ లో ఉన్నాడు. తన సినిమా కోసమే కేటాయించుకోలేని పవన్ మేనళ్లుడు సినిమా కోసం వస్తాడా అన్నది ప్రశ్న. పవన్ షెడ్యూల్ కు తగినట్టుగా కరుణాకరణ్, సాయి ధరం తేజ్ ఇద్దరు తమ డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా ఆగష్టు చివర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news