Gossipsవాళ్లు తీసేది తొలిప్రేమ-2.. డౌట్ లేకుండా ఫిక్స్ అవ్వొచ్చు..!

వాళ్లు తీసేది తొలిప్రేమ-2.. డౌట్ లేకుండా ఫిక్స్ అవ్వొచ్చు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో తొలిప్రేమ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ సినిమా దర్శకుడు కరుణాకరణ్ ఒక్క సినిమాతో క్రేజీ డైరక్టర్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ఎన్ని సినిమాలు తీసినా సరే ఆ రేంజ్ అందుకోలేదు. 2014లో చిన్న దానా నీకోసం సినిమా తీసిన కరుణాకరణ్ మూడేళ్ల తర్వాత మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తో సినిమా సెట్స్ మీదకు తెచ్చాడు.

సాయి ధరం తేజ్ లో ఇంతవరకు చూడని యాంగిల్ చూపిస్తా అని చెబుతున్న కరుణాకరణ్ తొలిప్రేమలో పవన్ కళ్యాణ్ క్యారక్టర్ కు కొనసాగింపుగా ఈ సినిమాలో తేజు పాత్ర ఉంటుందని అన్నాడు. లవ్, యాక్షన్, ఫ్యామిలీ అన్ని కలిసిన సినిమా ఇదని. కచ్చితంగా సినిమా సాయి ధరం తేజ్ కు మంచి సినిమా అవుతుందని అన్నారు. అయితే తొలిప్రేమ సినిమా పోలికలు చెబుతుంటే ఈ సినిమా తొలిప్రేమ పార్ట్-2 గా వస్తుందా అన్న ఆలోచనలు మొదలయ్యాయి.

ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఈ తరం యువకుల ఆలోచనలను బట్టి ఈ కథ రాసుకున్నాడట కరుణాకరణ్. కథ చాలా ఏళ్లుగా రాసుకున్నా దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నానని అన్నారు. ప్రస్తుతం సాయి ధరం తేజ్ కూడా అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరి కరుణాకరణ్ ఏం చేస్తాడో ఏమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news