Moviesబాక్సాఫీస్ పై ఛాలెంజ్ విసురుస్తున్న మెగా మేనళ్లుడు..!

బాక్సాఫీస్ పై ఛాలెంజ్ విసురుస్తున్న మెగా మేనళ్లుడు..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తిక్క, విన్నర్ సినిమాల ఫలితాలు నిరాశ పరచడంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాల మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం చేస్తున్న బివిఎస్ రవి జవాన్ రిలీజ్ కు రెడీ అవుతుండగా వినాయక్ సినిమాతో పాటుగా సెట్స్ మీదకు వెళ్తున్న కరుణాకరణ్ సినిమా మీద కూడా పూర్తి నమ్మకంతో ఉన్నాడు.

మామయ్యతో తొలిప్రేమ లాంటి ట్రెండ్ సెట్టర్ మూవీ తీసిన దర్శకుడితో కెరియర్ లో మొదటిసారి పనిచేస్తున్న సాయి ధరం తేజ్ మెగా ఫ్యాన్స్ ను మెప్పించేలా ఇది మరో తొలిప్రేమగా తీర్చిదిద్దుతున్నాడట. ఇక ఈ సినిమా టైటిల్ గా ఛాలెంజ్ అని పెట్టబోతున్నారని టాక్. బాక్సాఫీస్ పై మెగా మేనళ్లుడు విసురుతున్న ఛాలెంజ్ గా ఈ సినిమా ఉండబోతుందట.

సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ త్వరలో వెళ్లడించనున్నారు. కె.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ లవర్ బోయ్ గా కనిపిస్తాడట.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news