Gossipsఅక్కడ బాహుబలి ని బీట్ చేసిన రోబో 2.0

అక్కడ బాహుబలి ని బీట్ చేసిన రోబో 2.0

రోబో సీక్వల్ గా శంకర్, రజిని కాంబినేషన్ లో వస్తున్న సినిమా 2.0. రజినితో పాటు అక్షయ్ కుమార్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమా 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ న భూతో న భవిష్యత్ అన్న రేంజ్ లో జరుగుతుంది. ఇప్పటికే ఇండియాలో ఈ సినిమా బిజినెస్ బీభత్సం సృష్టిస్తుండగా ఓవర్సీస్ లో సినిమా 105 కోట్ల బిజినెస్ చేసిందట.

తెలుగు, తమిళ భాషల్లో కలుపుకుని ఈ రేటు పలికిందని తెలుస్తుంది. ఇండియ ఎపిక్ మూవీగా వచ్చిన బాహుబలి సినిమానే 60 నుండి 70 కోట్ల వరకే బిజినెస్ చేయగా 2.0 దానికి మించి బిజినెస్ చేస్తుంది. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా కలక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు.

సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం 2.0 రికార్డులను అందుకోవడం ఎవరికి సాధ్యం కాదని అనిపిస్తుంది. ముఖ్యంగా బాహుబలి రికార్డులను దాటేసే సినిమాగా వస్తున్న 2.0 అనుకున్న సక్సెస్ రేంజ్ అందుకుంటుందో లేదో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news