Gossipsరోబో పాట‌ల వేడుక తీవ్ర ఒత్తిడిలో రజని కాంత్..!

రోబో పాట‌ల వేడుక తీవ్ర ఒత్తిడిలో రజని కాంత్..!

ర‌జ‌నీ రోబో సీక్వెల్ కి ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు

పాట‌లు కూడా మూడంటే మూడే

సినిమాలో వినిపించేంది మాత్రం ఒక‌టే

ఇంకా ఇంకొన్ని విశేషాలు మీకోసం..

……………………………………………….

అవేంటంటే :: ‘2.ఓ’ ఆడియో వేడుకకి దుబాయ్‌ సిద్ధమైంది.బుర్జ్‌ అల్‌ అరబ్‌ టవర్స్‌లో ఆడియో వేడుకను శుక్ర‌వారం అట్టహాసంగా నిర్వహించను న్నారు.125 మంది సింఫ‌నీ కళాకారులతో ఏ.ఆర్‌ రెహమాన్  లైవ్ షో నిర్వహించనున్నారు. 12 వేల మంది కూర్చుని చూసేలా వేదికను ఏర్పాటు చేశారు. దుబాయ్‌లోని ప్ర‌ముఖ మాల్స్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. అంతేకాదు దుబాయ్‌ నగరం అంతా ‘2.ఓ’ భారీ కటౌట్లు, పోస్టర్లతో కళకళలాడుతోంది.

ఈ సందర్భంగా స్థానిక పామ్‌ జుమేరాయ్‌ ప్రదేశంలో ‘2.ఓ’ పోస్టర్‌తో తయారుచేసిన పారాచూట్‌తో ముగ్గురు వ్యక్తులు స్కైడైవింగ్‌ చేశారు.దాదాపు 10,000 అడుగుల ఎత్తులో స్కైడైవింగ్‌ చేసినట్లు చిత్ర నిర్మాత రాజు మహాలింగం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. నవంబర్‌లో హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరగనుంది. 2018 జనవరిలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్న నేప‌థ్యంలో ర‌జ‌నీ సైతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. గ‌త చిత్రాలు ఏమంత‌గా ఆడ‌క‌పోవ‌డంతో ఆయ‌న కాస్త నిరాశ‌కు గురైన సంగ‌తి తెలిసిందే!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news