Gossipsఆ హీరోయిన్‌తో ర‌కుల్ సోద‌రుడికి లింకుందా..!

ఆ హీరోయిన్‌తో ర‌కుల్ సోద‌రుడికి లింకుందా..!

అందాల భామ రకుల్ ప్రీతి ఇప్పుడు హీరోయిన్లను సినిమాల్లో సిపార్సు చేయించే రేంజ్ కి వెళ్ళిపోయింది. తాజాగా ఆమె తనకు కావాల్సిన ఒక అమ్మాయిని హీరోయిన్ క్యారెక్షర్ కి రికమండేషన్ చేసి తన తడాఖా నిరూపించుకుంది. షూటింగ్ ప్రారంభం అయిన ఆ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ర‌కుల్ రిక‌మెండ్ చేసిన హీరోయిన్ గురించి ఆరా తీస్తే అస‌లు మ్యాట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇండో – పాక్‌ వార్‌ నేపథ్యంలో పూరి ఆకాష్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘మెహబూబా’. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్‌ని తొలిసారి డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆకాష్ – నేహా శెట్టి జంటగా “మెహబూబా” సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇది పూరి మార్క్ ప్రేమకథ చిత్రమని చెబుతున్నారు. అయితే, నేహా శెట్టి ఈ సినిమా ఆఫర్ కొట్టేయడం వెనక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. రకుల్ సోదరుడు అమన్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తిని చూపుతున్న విషయం తెలిసిందే. అమన్ ప్రియురాలే నేహా శెట్టి.

రకుల్ సోదరుడు అమన్ కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈమె కోసం రకుల్ పూరికి సిఫార్సు చేయడంతోనే మెహబూబా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్‌ స్పీడుతో సాగుతోంది. వివిధ ప్రాంతాల్లో షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. మరీ మెహబూబ గా నేహా శెట్టి ఏ రేంజ్ లో తన ఫెరఫామెన్స్ చూపిస్తుందో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news