Newsప్రభాస్ రేంజ్ ఇది.. ఇక తిరుగులేని రాజు అతనే..!

ప్రభాస్ రేంజ్ ఇది.. ఇక తిరుగులేని రాజు అతనే..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది. బాహుబలి కోసం ఐదేళ్లు తన కెరియర్ రాజమౌళికి రాసిచ్చేసిన ప్రభాస్ అంతకంత రెట్టింపు క్రేజ్ దక్కించుకున్నాడు. బాహుబలి మొదటి రెండు పార్టుల ఎఫెక్ట్ తో ప్రభాస్ రేంజ్ ఏంటో తెలిస్తే అందరు షాక్ అవుతారు. తన క్రేజ్ ను చూసి ముక్కున వేలేసుకుంటారు. అదెలా అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో. ఆ సినిమా కేవలం ఆన్ లైన్ రైట్స్ 50 కోట్లకు అమ్ముడయ్యాయంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

నెట్ ప్లిక్స్ అనే సంస్థ ప్రభాస్ సాహోని 50 కోట్లకు ఆన్ లైన్ రైట్స్ కొనేసిందట. ఇది ఓ రకంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ అని చెప్పాలి. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కించబడుతుంది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించబడుతుంది.

సినిమా రిలీజ్ కు ముందే రేంజ్ ఇలా ఉంటే ట్రైలర్ రిలీజ్ అయితే ఇకా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఆలోచిస్తున్నారు. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కథ కథనాలన్ని హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటాయట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news