Moviesరవితేజ టచ్ చేసి చూడు సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు :...

రవితేజ టచ్ చేసి చూడు సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు : ఈ సారైనా టచ్ చేస్తాడా?

మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన టచ్ చేసి చూడు సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.మార్నింగ్ షో నుండి డివైడ్ టాక్ తెచ్చుకున్న టచ్ చేసి చూడు సినిమా మొదటి రోజు కలెక్షన్ల పైనే ఇప్పుడు అందరి దృష్టి. రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన రాజా ది గ్రేట్ పర్వాలేదపించినా రవితేజ స్థాయి హిట్ కాదనే చెప్పాలి. ఇక రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్లు తెచ్చుకున్న బెంగాల్ టైగర్ సినిమాని ఈ సారి కూడా టచ్ చేసేలా కనిపించటం లేదు.

రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ డే వన్ రికార్డు కలెక్షన్లు బెంగాల్ టైగర్ (Rs 7.35 gross/Rs 5.28 crore share) కి వచ్చాయి. అయితే ప్రస్తుతం తెలుస్తున్న ట్రెండ్స్ లెక్కల ప్రకారం టచ్ చేసి చూడు సినిమాకి 5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది.

ఇప్పటివరకు రవితేజ కెరీర్ లో వచ్చిన టాప్ 4 సినిమాలకి ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి :
బెంగాల్ టైగర్ (Rs 7.35 gross/Rs 5.28 crore share), కిక్ 2 (Rs 7.65 crore/Rs 5.77 crore) , పవర్ (Rs 7.34 crore/Rs 5.14), రాజా ది గ్రేట్ (Rs 7.22 crore/ Rs 4.90 crore)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news