Moviesరవితేజ "టచ్ చేసి చూడు" సినిమా రివ్యూ రేటింగ్

రవితేజ “టచ్ చేసి చూడు” సినిమా రివ్యూ రేటింగ్

కథ :

కార్తిక్ (రవితేజ) ఓ పోలీస్ ఆఫీసర్.. సెల్వం భాయ్ చేస్తున్న అరాచకాల వల్ల విసుగుచెందిన డిజిపి అతన్ని టార్గెట్ చేస్తాడు. అయితే విషయం ముందే తెలుసుకున్న భాయ్ డిజిపికి వార్నింగ్ ఇస్తాడు. ఇక ఈ ఆపరేషన్ లోకి కార్తిక్ ను దించుతాడు. అందులో భాగంగా పుష్ప (రాశి ఖన్నా)తో ప్రేమలో పడతాడు కార్తిక్. సెల్వం భాయ్ తో ఫైట్ కు రంగంలో దిగిన కార్తిక్ కు ఓ నిజం తెలుస్తుంది.. కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది.. అసలు కార్తికేయ ఆపరేషన్ ఏంటి..? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి..? డిజిపి ఎందుకు కార్తిక్ నే ఈ ఆపరేషన్ కు ఎంచుకున్నాడు అన్నది అసలు కథ.

నటీనటుల ప్రతిభ :

మాస్ మహరాజ్ రవితేజ అభిమానులకు నచ్చేలా మరో మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన మార్క్ ఈజ్ తో సినిమాలో కనిపించాడు. అయితే క్యారక్టరైజేషన్ లో కొత్తదనం కనిపించలేదని చెప్పాలి. రవితేజ వరకు సూపర్ గా చేశాడు. రాశి ఖన్నా ఈ సినిమాలో గ్లామర్ డాల్ గా కనిపించింది. లిప్ లాక్ సీన్ అదిరిపోయింది. సీరత్ కపూర్ కూడా మంచి పాత్రే చేసింది. మురళి శర్మ ఎప్పటిలానే సహజ నటనతో ఆకట్టుకోగా సుహాసిని కూడా చిన్న పాత్రే అయినా ఇంప్రెస్ చేశారు. విలన్ ఫ్రెడ్దీ దరువాలా బాగానే చేశాడు. మిగిలిన పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

దర్శకుడు కథ కథనాల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. కథ కూడా ఏమంత కొత్తగా అనిపించదు. ఇక కథనం కూడా ఇంప్రెస్ చేయలేదు. రిచార్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రియతం మ్యూజిక్ ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొత్తగా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు ఎంత అవసరమో అంతా పెట్టేశారు.

విశ్లేషణ :

రెండేళ్ల తర్వాత రాజా ది గ్రేట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఆ సినిమా హిట్ అందుకోగా తర్వాత వచ్చిన ఈ టచ్ చేసి చూడు అంచనాలను అందుకోలేదని చెప్పాలి. సినిమా కథ కథనాల్లో దర్శకుడు విఫలమయ్యాడు. ఫస్ట్ హాఫ్ ఏదో సాగదీతగా అనిపిస్తుంది. ఎక్కడ ఇంట్రెస్ట్ అన్నది క్రియేట్ చేయలేకపోయాడు. ఇక సెకండ్ హాఫ్ రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఉన్నా సినిమాను నిలబెట్టలేకపోయాయి.

రవితేజ మార్క్ మాస్ అంశాలు కొన్నిటిని అనుకుని రాసుకున్న కథ అనుకోవచ్చు. ఇక ఇలాంటి కథలు తెలుగు సినిమాల్లో చాలా వచ్చాయి. మళ్లీ అదే కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కథనంలో ఏమాత్రం కిక్ అనిపించలేదు. సినిమా కాస్టింగ్ ను దర్శకుడు సరిగా వాడుకోలేదని చెప్పాలి. హీరో పోలీస్ పాత్ర అయినా తన క్యారక్టరైజేషన్ మీద ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండనిపిస్తుంది.

కథ కథనాలు ఇంట్రెస్టింగ్ గా నడిపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. సినిమాలో ఏదో ఉంటుంది అని ఆశపడ్డ వారికి నిరాశే మిగులుతుంది. మాస్ రాజా అభిమానులకు మాత్రం కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి.

ప్లస్ పాయింట్స్ :

రవితేజ

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

కథ, కథనం

డైరక్షన్

బాటం లైన్ :

టచ్ చేసి చూడు.. కేవలం రవితేజ కోసమే..!

రేటింగ్ : 2.5/5

http://www.telugulives.com/telugu/nagashorya-rashmika-mandana-chalo-movie-review-rating/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news