Newsపవన్ కళ్యాణ్ పై మాస్ మహారాజ సంచలన వ్యాఖ్యలు : సోషల్...

పవన్ కళ్యాణ్ పై మాస్ మహారాజ సంచలన వ్యాఖ్యలు : సోషల్ మీడియా లో రచ్చ రచ్చ

మాస్ మహరాజ్ రవితేజ విక్రం సిరి కాంబోలో వచ్చిన టచ్ చేసి చూడు నిన్న రిలీజైన సంగతి తెలిసిందే. అంచనాలను అందుకోవడంలో విఫలమైన ఈ సినిమా చూసి ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో రవితేజ చేసిన లైవ్ చాట్ కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది. టచ్ చేసి చూడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ తో లైవ్ చాట్ చేసిన మాస్ రాజా పవన్ గురించి మీ అభిప్రాయం అనగానే నెక్ష్ట్ అనేశాడు.

అదే పవన్ ఫ్యాన్స్ కు కాస్త నిరాశ కలిగేలా చేసింది. ఇక మరో ఫ్యాన్ మీ పేటిఎం నెంబర్ చెప్పండి అనగా.. అడుక్కునే వాడిలా కనిపిస్తున్నానా అంటూ రిప్లై ఇచ్చాడు. పేటిఎం లేదు అని చెబితే సరిపోయేదానికి ఇలా అడుక్కునే వాడినా అదా ఇదా అని అనడం కాస్త నెటిజెన్లకు కోపం తెప్పించింది. దీనిపై సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది.

అసలే సినిమా పోయి అసంతృప్తిగా ఉన్న రవితేజకు ఈ లైవ్ చాట్ మరో పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్స్ ఏ కొంచం తప్పుగా మాట్లాడినా చీల్చి చెండాడేస్తున్నారు. మరి రవితేజ ఈ మ్యాటర్ నుండి ఎలా బయటపడతాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news