Reviewsరాజా ది గ్రేట్ టీజర్.. కుమ్మేసిన రవితేజ..!

రాజా ది గ్రేట్ టీజర్.. కుమ్మేసిన రవితేజ..!

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా అనీల్ రావిపూడి డైరక్షన్ లో వస్తున్న సినిమా రాజా ది గ్రేట్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహెరిన్ పిర్జాది కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో బ్లైండ్ క్యారక్టర్ లో నటిస్తున్న రవితేజ ఈరోజు టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాస్ రాజా టైటిల్ కు తగ్గట్టుగా టీజర్ అదరగొట్టేసింది. ఐయాం బ్లైండ్ బట్ ఐయాం ట్రైనెడ్ అంటూ రవితేజ చెప్పే డైలాగ్ అదుర్స్.

పటాస్, సుప్రీం సినిమాలతో హిట్ అందుకున్న అనీల్ రావిపుడి అసలు సిసలైన మాస్ సినిమా ఇదే. రాజా ది గ్రేట్ అంటూ యాప్ట్ అయిన టైటిల్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ మాస్ రాజా ఫ్యాన్స్ కు పండుగ తెచ్చింది. ఇక త్వరలో రిలీజ్ అవబోతున్న ఈ సినిమా రవితేజకు హిట్ ఇస్తుందని అనిపిస్తుంది. సాయి కార్తిక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి ఇదే రేంజ్ లో సినిమా కూడా ఉంటుందేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news