Moviesనేలటికెట్టు సెన్సార్ రివ్యూ.. రవితేజ ఫాంలోకి రావడం గ్యారెంటీ..!

నేలటికెట్టు సెన్సార్ రివ్యూ.. రవితేజ ఫాంలోకి రావడం గ్యారెంటీ..!

మాస్ మహరాజ్ రవితేజ సినిమా అంటే ఫేవరిజం ఎవరైనా సరే ఆయన సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు సిని ప్రియులు. మాస్ రాజా జోష్.. మాస్ ఫాలోయింగ్.. డైలాగ్ డెలివరీ ఇవన్ని కేవలం రవితేజకు మాత్రం సొంతం అయినట్టుగా ఉంటాయి. కెరియర్ లో ఆటుపోట్లు ఎన్నొచ్చినా మళ్లీ స్ట్రాంగ్ గా నిలబడే వాళ్లలో రవితేజ ఒకరు.

బెంగాల్ టైగర్ తర్వాత రెండేళ్లు గ్యాప్ ఇచ్చిన రవితేజ రాజా ది గ్రేట్ తో ఫాంలోకి వచ్చాడు. మళ్లీ టచ్ చేసి చూడు సినిమా నిరాశ పరచింది. అందుకే ఈసారి సక్సెస్ ఫుల్ డైరక్టర్ తో సక్సెస్ ఫుల్ మూవీ తీశాడని రిలీజ్ ముందే చెప్పేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో రవితేజ హీరోగా వస్తున్న సినిమా నేల టిక్కెట్టు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

సెన్సార్ నుండి యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది ఈ సినిమా. టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరచగా రవితేజ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేలా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. సెన్సార్ టీం నుండి కూడా ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూస్ వచ్చాయట. మరి అసలు ఫలితం ఏంటన్నది మరో వారంలో తెలుస్తుంది. మే 25న రిలీజ్ అవుతున్న నేల టికెట్టు సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా ఫిదా మ్యూజిక్ డైరక్టర్ శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ అందించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news