Moviesరారండోయ్ వేడుక చూద్దాం 17 రోజుల కలెక్షన్లు.. చైతూ కెరీర్ లోనే...

రారండోయ్ వేడుక చూద్దాం 17 రోజుల కలెక్షన్లు.. చైతూ కెరీర్ లోనే ‘టాప్’ లేచింది

‘రారండోయ్ వేడుక చూద్దాం’ అంటూ చాలా సింపుల్ గా వచ్చేశాడు నాగ్ చైతన్య. ఆయన తండ్రి మరియు ప్రొడ్యూసర్ నాగార్జున కూడా ఈ సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసి గ్రాండ్ హిట్ కొట్టేశాడు. ధియేటర్లలో మూడు వారాల రన్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ అనిపించుకుంటోంది.

మొత్తం 17 రోజులకు గాను.. కళ్యాణ్ కృష్ణ డైరక్షన్లో రూపొందిన రారండోయ్ వేడుక చూద్దాం ఏకంగా 25+ కోట్ల షేర్ వసూలు చేసింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఇరగదీస్తూ ఏకంగా 10 కోట్ల షేర్.. నైజాంలో 8.1+ కోట్లు షేర్.. సీడెడ్లో 2.71 కోట్లు షేర్ వసూలు చేసింది.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని 21+ కోట్లు షేర్ తెచ్చుకుంది. ఇక కర్ణాటకలో అమెరికాలో ఇతర స్టార్ కిడ్స్ తో పోల్చుకుంటే చైతూ మార్కెట్ కాస్త చిన్నదే అయినప్పటికీ.. అలాంటి టెరిటరీస్ అన్నీ కలుపుకుని 4 కోట్ల షేర్ తెచ్చాడు. మొత్తంగా 25+ కోట్ల షేర్ తో మాంచి హిట్టే కొట్టాడు.

ఇకపోతే సమ్మర్ లో బాహుబలి 2 తరువాత మరో సినిమా ఏదీ హిట్టవ్వలేదు. కొద్దోగొప్పో రారండోయ్ వేడుకచూద్దాం ఒకటే ఆ లోటును బాగా క్యాష్ చేసుకుంది. ఎలాగో జూన్ 23న డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమా వచ్చే వరకు పెద్ద సినిమాలేవీ లేవు కాబట్టి.. రారండోయ్ కు ఇంకాస్త కుమ్ముకునే ఛాన్సు దొరికినట్లే. అది సంగతి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news