Gossipsరంగస్థలం స్టోరీ లీక్.. సుకుమార్ మార్క్ సెంటిమెంట్ తో చరణ్..!

రంగస్థలం స్టోరీ లీక్.. సుకుమార్ మార్క్ సెంటిమెంట్ తో చరణ్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. పల్లెటూరి ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. హాట్ యాంకర్ అనసూయ కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిమ్రిస్తున్నారు.
ఇక ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఓ కథ ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది. రాం చరణ్ సోదరుడిగా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. ఈ సినిమాలో అతన్ని కూడా ఇంపార్టెంట్ రోల్ అని అంటున్నారు. అన్న మీద ప్రేమతో చరణ్ ఏం చేశాడు అన్నదే సినిమా కథ. అన్నదమ్ములుగా చరణ్, ఆదిల మధ్య సెంటిమెంట్ సీన్స్ అదిరిపోతాయని అంటున్నారు.
అంతేకాదు ఆది పాత్ర మధ్యలో ఎండ్ అవుతుందట. ఇక అప్పటి నుండి అసలు ట్విస్ట్ వస్తుందని అంటున్నారు. మొత్తానికి సినిమా కథ చూస్తే ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతోలో నాన్నను మోసం చేసిన వాడి మీద పగ తీర్చుకోవడం అయితే.. ఇందులో అన్న మీద ఇష్టంతో పగ తీర్చుకుంటాడట.
ఇక సుకుమార్ మార్క్ స్టైలిష్ ఎంటర్టైనర్ గా సినిమా ఉంటుందట. 1985 నేపథ్యంలో కాబట్టి అప్పటి కాలంలో ఉండే కొన్ని అద్భుతమైన అంశాల గురించి కూడా సుకుమార్ ఈ సినిమాలో ప్రస్థావిస్తాడని అంటున్నారు.http://www.telugulives.com/telugu/jai-simha-movie-records-details/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news