Moviesరంగస్థలం నుండి చిట్టిబాబు అవుట్..!

రంగస్థలం నుండి చిట్టిబాబు అవుట్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. ఈ సినిమా మార్చి 30న రిలీజ్ అవుతున్నా ఇప్పటివరకు షూటింగ్ జరుగుతూ వస్తుంది. ఇక ఈ సినిమా కోసం చిట్టిబాబుగా మారి కొత్త అవతారం ఎత్తిన చరణ్ మొత్తానికి సినిమాను పూర్తి చేశాడట. సుకుమార్ సినిమా కోసం తన కెరియర్ లోనే ఎక్కువ రోజులు ఈ సినిమా కోసం కేటాయించాడు రాం చరణ్.

చిట్టిబాబు సౌండ్ ఇంజనీర్ (చెవిటి వ్యక్తి)గా రాం చరణ్ సరికొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. సినిమా టీజర్ లోనే మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల మనసు గెలిచిన చరణ్ కచ్చితంగా సినిమాతో సంచలనాలు సృష్టిస్తాడని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ రంగస్థలం సినిమాలో రాం చరణ్ సరసన సమంత ఫీమేల్ లీడ్ చేస్తుంది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పల్లెటూరి ప్రేమకథగా రాబోతుంది. మార్చి 30న సమ్మర్ సందడి షురూ చేసేలా సుకుమార్, రాం చరణ్ ల రంగస్థలం రచ్చ మొదలు కాబోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news