Moviesరంగస్థలం 4 డేస్ కలక్షన్స్.. చిట్టి బాబు రీసౌండ్ అదిరింది..!

రంగస్థలం 4 డేస్ కలక్షన్స్.. చిట్టి బాబు రీసౌండ్ అదిరింది..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా రంగస్థలం. మార్చి 30న రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం అందుకుని బాక్సాఫీస్ దగ్గర చరణ్ సత్తా చాటుతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో 2 మిలియన్ క్రాస్ చేసి సంచలనం సృష్టించిన రంగస్థలం ఓవరాల్ గా 50 కోట్ల మార్క్ దాటి వసూళ్ల వేగంతో దూసుకెళ్తుంది.

ఏరియాల వారిగా ఈ సినిమా వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..

నైజాం 12.54 కోట్లు

సీడెడ్ 8.80 కోట్లు

ఉత్తరాంధ్ర 6.09 కోట్లు

గుంటూరు 5.14 కోట్లు

ఈస్ట్ 4.06 కోట్లు

వెస్ట్ 3.12 కోట్లు

కృష్ణా 3.57 కోట్లు

నెల్లూరు 1.63 కోట్లు

మొత్తం ఏపి/ తెలంగాణా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని 44.95 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 3 రోజుల వరకు 6.05 కోట్లు, ఓవర్సీస్ లో 3 రోజుల వరకు 11.25 కోట్లు వసూళ్లను రాబట్టింది రంగస్థలం. వరల్డ్ వైడ్ గా మొత్తం 55.77 కోట్ల గ్రాస్ అది కూడా 3 రోజుల కలక్షన్స్ సాధించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news