Gossipsఆ సినిమా సీక్వెల్లో రానా..!

ఆ సినిమా సీక్వెల్లో రానా..!

ద‌గ్గుపాటి రానా-శేఖ‌ర్ క‌మ్ముల‌ కాంబినేష‌న్ లో 2010లో వ‌చ్చిన లీడ‌ర్ సినిమా గుర్తుంది కదా..! ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా  విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్న సంగ‌తి సినీ అభిమానులకు తెలిసిందే. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కించిన సినిమాలో కుల రాజకీయాలు ఎలా ఉంటాయో సవివరంగా చెప్పి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ త‌ర్వాత ఈ క‌థ‌కు సీక్వెల్ కూడా వ‌స్తుంద‌ని చాలా కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. కాని కార్యరూపం దాల్చలేదు .

తాజా సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల రానాతో ఒక పాయింట్ చెప్పాడంట. అది నచ్చిన రానా సినిమా చేద్దామని మాట ఇచ్చినట్లు ఫిల్మ్‌న‌గ‌ర్లో వార్తలు చెక్కెర్లు కొడుతున్నాయి. అయితే శేఖర్ కమ్ముల చెప్పిన పాయింట్ కొత్తదా ? లేక లీడర్ సీక్వెలా ? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఫిదా తరువాత శేఖర్ కమ్ముల రానాతోనే సినిమా చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతవరుకు ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన లేదు.

ఈ యేడాది రానాకు బాగా క‌లిసొచ్చింది. వ్య‌క్తిగ‌తంగా కూడా రానా మార్కెట్ పెరిగింది. బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమాతో దేశ‌వ్యాప్తంగా రానా మ‌రింత‌గా పాపుల‌ర్ అయ్యాడు. ఇక ఘాజీ ప‌ర్వాలేద‌నిపించింది. ఇటీవ‌ల వ‌చ్చిన నేనే రాజు – నేనే మంత్రి సినిమాతో సక్సెస్ లో ఉన్న రానా తాజాగా యుద్ధ నేప‌థ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే త్వరలోనే శేఖర్ కమ్ముల – రానా కాంబినేషన్ లో రాబోయే సినిమా గురించి వారి నోటి నుంచే విశేషాలు బయటకి వచ్చే అవకాశం ఉంది. సో వెయిట్ ఆండ్ వాచ్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news