Gossipsరానా న్యూ లుక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

రానా న్యూ లుక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలంటే ముందు గుర్తొచ్చే హీరో దగ్గుబాటి వారసుడు రానానే. ఇమేజ్ తో సంబందం లేకుండా సినిమాలు చేస్తూ క్రేజ్ సంపాదించుకున్న రానా నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. బాహుబలిలో భళ్లాలదేవాగా రానా తప్పించి ఇంకెవరిని ఒప్పుకోలేం. ఇక ఈమధ్యనే నేనే రాజు నేనే మంత్రి సినిమాతో అలరించిన రానా ప్రస్తుతం మరో పిరియాడికల్ మూవీ చేస్తున్నాడు.

1945 టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో రానా లుక్ రివీల్ అయ్యింది. క్లీన్ షేవ్ తో ముదురు మీసంతో రానా లుక్ అదరహో అనిపిస్తుంది. సినిమాకు తగ్గ లుక్ తో సర్ ప్రైజ్ చేసిన రానా మళ్లీ మరో ప్రయోగం చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా డీటేల్స్ ఇంకా రివీల్ చేయలేదు. త్వరలో సినిమా కాస్ట్ అండ్ క్రూ వెళ్లడిస్తారట.

తను చేసే సినిమాలకు ఆడియెన్స్ నుండి అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుండటంతో రానా సినిమా సినిమాకు ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. మరి 1945తో రానా ఎలాంటి ఫీట్ సాధిస్తాడో చూడాలి.rana

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news