Gossipsచంద్రబాబుగా రానా.. మే 28కి అంతా క్లియర్..!

చంద్రబాబుగా రానా.. మే 28కి అంతా క్లియర్..!

బాలకృష్ణ హీరోగా ఎన్.టి.ఆర్ బయోపిక్ పై రోజుకో వార్త సంచలనంగా మారింది. ఆరంభం అట్టహాసంగా మొదలు పెట్టినా మధ్యలో దర్శకుడు తేజ ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్లడంతో మళ్లీ మొదటిక్ వచ్చింది. అయితే దర్శకుడు ఫైనల్ అయ్యే ఈ క్రమంలో సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి బాలకృష్ణే ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారట.

అందులో భాగంగానే ఎన్.టి.ఆర్ సినిమాలో నారా చంద్రబాబుగా రానాని ఫైనల్ చేశాడట బాలయ్య బాబు. దగ్గుబాటి వారసుడిగా తన దగ్గరకు ఎలాంటి పాత్ర వచ్చినా కాదనకుండా చేసే రానా హీరోగా చేస్తూనే విలన్ గా విశ్వరూపం చూపించాడు. ఇక ప్రస్తుతం తెలుగులో క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న రానా ఎన్.టి.ఆర్ బయోపిక్ లో పాలు పంచుకోవడం సినిమాకు మరింత కలరింగ్ తెస్తుందని చెప్పొచ్చు.

ఇక సినిమా దర్శకుడు ఎవరన్న విషయం మీద మే 28 ఎన్.టి.ఆర్ జయంతి కల్లా క్లారిటీ వచ్చేస్తుందని తెలుస్తుంది. ఆరోజు నుండి మళ్లీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news