Moviesబాబాయ్ ఒక్క మాట..చరణ్ క్లాస్ టచ్...

బాబాయ్ ఒక్క మాట..చరణ్ క్లాస్ టచ్…

 మెగా హీరోలు తమ ప్రవర్తనతో ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేపుతుంటే మెగా వారసుడు రాం చరణ్ మాత్రం అందరి మనసులను గెలుచుకుంటున్నాడు. ఓ పక్క అల్లు అర్జున్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు చెప్పను బ్రదర్ ఎపిసోడ్ తో దూరమయ్యాడు. ఇక రీసెంట్ గా డిజె గొడవలో మెగా ఫ్యాన్స్ కూడా బన్ని మీద గుస్సాగా ఉన్నారు. ఈ క్రమంలో మైక్ అందితే మెగా హీరోలు మాట్లాడే విషయాలపై నానా రచ్చ చేస్తున్నారు.
ఈ విషయంలో చరణ్ మాత్రం టూ క్లవర్ గా వ్యవహరించడం జరుగుతుంది. రీసెంట్ గా దర్శకుడు ఆడియో రిలీజ్ కు అతిధిగా వచ్చిన చరణ్ సినిమా గురించి సుకుమార్ గురించి మాట్లాడాడు. అంతేకాదు తను మాట్లాడుతున్నప్పుడు పవర్ స్టార్ పవర్ స్టార్ కేకలేయడంతో బాబాయ్ గురించి కూడా మనసు విప్పాడు. మనసులో ఉన్న వారి గురించి ఏం మాత్లాడాలి.. వారు ఎప్పుడు మనసులోనే ఉంటారు.
అంతేకాదు మనసులో చాలా ఉంటుంది కాని.. మాటల్లో తక్కువ ఉంటుంది అంటూ చరణ్ చెప్పకనే చెప్పాడు. అటు మెగా ఫ్యాన్స్ ఖుషి చేస్తూనే పవర్ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేశాడు రాం చరణ్. బాబాయ్ అని ఒక్క మాట చెప్పి.. భలే తెలివిగా ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు చరణ్. చరణ్ ఇచ్చిన స్పీచ్ మెగా ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహాన్ని తెచ్చింది. మైక్ దొరికితే మెసేజ్ లు ఇచ్చేస్తున్న మెగా హీరోలకు చరణ్ స్పీచ్ చూసి మారితే బెటర్ అని కామెంట్లు చేస్తున్నారు.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news